ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

recrutement పకడ్బందీగా పోలీసుల నియామక ప్రక్రియ

ABN, Publish Date - Dec 28 , 2024 | 11:57 PM

ఉమ్మడి విజయనగరం జిల్లాలో చేపడుతున్న పోలీసు ఉద్యోగ నియామక ప్రక్రియ పకడ్బందీగా సాగాలని, విధుల్లో ఎవరూ అలసత్వం వహించవద్దని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అధికారులను ఆదేశించారు. సివిల్‌ పోలీసు కానిస్టేబుల్స్‌, ఏపీఎస్‌పీ కానిస్టేబుల్స్‌ నియామక ప్రక్రియ ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు.

పకడ్బందీగా పోలీసుల నియామక ప్రక్రియ

నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి

ఎస్పీ వకుల్‌జిందాల్‌

విజయనగరం క్రైం, డిసెంబరు 28( ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విజయనగరం జిల్లాలో చేపడుతున్న పోలీసు ఉద్యోగ నియామక ప్రక్రియ పకడ్బందీగా సాగాలని, విధుల్లో ఎవరూ అలసత్వం వహించవద్దని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అధికారులను ఆదేశించారు. సివిల్‌ పోలీసు కానిస్టేబుల్స్‌, ఏపీఎస్‌పీ కానిస్టేబుల్స్‌ నియామక ప్రక్రియ ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులు, మినిస్టీరియల్‌ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ఉద్యోగ నియామకాల ప్రక్రియ చాలా సున్నితమైనదని, ప్రతి ఒక్కరూ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. అలసత్వంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నియామకాలు పూర్తిగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, సాంకేతిక ఆధారంగా, సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. అభ్యర్థుల సర్టిఫికెట్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఏమైనా సందేహాలుంటే సంబంధిత అధికారులు లేదా తన దృష్టికి తీసుకురావాలన్నారు. నియామకాల ప్రక్రియ ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ప్రారంభమౌతుందని, అభ్యర్థులు హాల్‌ టిక్కెట్లతో పాటు పుట్టిన తేదీ, విద్యార్హతలు, రిజర్వేషన్‌ ధ్రువపరిచే అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్‌లను తప్పనిసరిగా తీసుకురావా లన్నారు. ఏదైనా కారణంతో అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్‌లు తీసుకురావడంలో విఫలమైతే, వారికి రిక్రూట్‌మెంట్‌ జరిగే మరో రోజున అవకాశం ఇస్తామన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్‌ స్టాఫ్‌కు గుర్తింపు కార్డు ఇస్తామని, వారు మాత్రమే పరేడ్‌ గ్రౌండ్‌లో ఉండాలన్నారు. వైద్య, పారామెడికల్‌ సిబ్బంది, అంబులెన్స్‌ను అందుబాటులో వుంచాలని ఆదేశించారు.

దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు

పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలు టీఎంటీ, పీఈటీ పరీక్షలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని, దళారులను నమ్మి మోసపోవద్దని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అభ్యర్థులకు సూచించారు. ఉద్యోగాలు కల్పిస్తామని ఆశలు కల్పించే దళారులు, మోసగాళ్లు మాట నమ్మవద్దని, ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసినట్టయితే, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఏఎస్‌పీలు సౌమ్యలత, జి నాగేశ్వరరావు, డీఎస్పీలు యూనివర్స్‌, వీరకుమార్‌, బాపూజీ, టీఎం శ్రీనివాసరావు, థామస్‌రెడ్డి, ఏవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఫోటోరైటప్‌: 29 విజడ్పీ 10: సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌

===============

.

Updated Date - Dec 28 , 2024 | 11:57 PM