ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Revenue Meetings 567 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

ABN, Publish Date - Dec 26 , 2024 | 12:18 AM

Revenue Meetings in 567 Villages జిల్లాలో 567 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 567 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు పార్వతీపురం డివిజన్‌లో 244, పాలకొండ డివిజన్‌లో 323 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామన్నారు. మిగిలిన రెవెన్యూ గ్రామాల్లో సైతం పక్కాగా సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామసభలలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి రశీదును అందించాలని తెలిపారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించి ధ్రువప్రతాలు జారీ చేయాలన్నారు. ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించాలని సూచిం చారు. ఆన్‌లైన్‌లో అన్ని ఫిర్యాదులను నమోదు చేయాలని, తహసీల్దార్‌ నేతృత్వంలోని బృందం విచారణకు వెళ్లే సమయాన్ని ముందుగా ఆ గ్రామస్థులకు తెలియజేయాలని ఆదేశించారు. కోర్టు కేసులను గుర్తించడానికి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలన్నారు. సరిహద్దు వివాదాలు ఉంటే మండల సర్వేయర్‌తో భూ సర్వే చేయించాలని తెలిపారు.

Updated Date - Dec 26 , 2024 | 12:18 AM