ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చూడితో ఉన్న ఆవుకు సీమంతం

ABN, Publish Date - Dec 28 , 2024 | 12:36 AM

విజ యనగరం జిల్లా బొబ్బిలి పట్టణం మల్లమ్మ పేటలో చూడితో ఉన్న ఆవుకు మహిళలు చీర, సారె పెట్టి ప్రత్యేక పూజలు చేశారు.

ఆవుకు పూజలు చేస్తున్న మహిళలు

బొబ్బిలి నవంబరు 27(ఆంధ్రజ్యోతి): విజ యనగరం జిల్లా బొబ్బిలి పట్టణం మల్లమ్మ పేటలో చూడితో ఉన్న ఆవుకు మహిళలు చీర, సారె పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. వడ్దాది కూర్మారావుకు చెందిన ఆవు ఏడు నెలల చూడితో ఉంది. ఈ అవుకు అదే గ్రామానికి చెందిన పండా లక్ష్మి, వడ్డాది లక్ష్మి తదితరులు శుక్రవారం సీమంతం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆవుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చీర కప్పారు. స్వీట్లు, గాజులు, పళ్లు కూడా పెట్టారు. అలంకరించిన ఆవును వీధిలో ఊరేగించి దానికి మేత పెట్టారు. గోమాత చుట్టూ మహిళలు ప్రదక్షిణలు చేశారు. ఈ సీమంతం తంతు చేసేందుకు అనేకమంది తరలివచ్చారు. అందరికీ శుభం జరగాలన్న ఉద్దేశంతో చూడితో ఉన్న ఆవుకు సీమంతం చేశామని పండా లక్ష్మీ తెలిపారు.

Updated Date - Dec 28 , 2024 | 12:36 AM