ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Shaking గజగజలాడిస్తున్నాయ్‌..

ABN, Publish Date - Dec 28 , 2024 | 11:55 PM

గరుగుబిల్లి మండలాన్ని గజరాజులు వీడడం లేదు. కొద్దిరోజులుగా సుంకిలోనే సంచరిస్తున్న ఏనుగులు వరి కుప్పలు , ధాన్యం నిల్వలతో పాటు అరటి, తదితర వాటిని నాశనం చేశాయి.

సుంకి గ్రామ సమీప తోటల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు

భయాందోళనలో గ్రామస్థులు, రైతులు

గరుగుబిల్లి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గరుగుబిల్లి మండలాన్ని గజరాజులు వీడడం లేదు. కొద్దిరోజులుగా సుంకిలోనే సంచరిస్తున్న ఏనుగులు వరి కుప్పలు , ధాన్యం నిల్వలతో పాటు అరటి, తదితర వాటిని నాశనం చేశాయి. శనివారం గ్రామంలోని టీ దుకాణం, రైతుల వ్యవసాయ సామగ్రితోపాటు పైపులను ధ్వంసం చేశాయి. పగలు పంట పొలాల్లో, రాత్రిళ్లు తోటల్లో ఉంటూ గ్రామస్థులు, రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆ ప్రాంతవాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గజరాజుల గుంపును తరలించడంలో అటవీ శాఖాధికారులు విఫలమ య్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:55 PM