ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sprouts for grain: ధాన్యానికి మొలకలు

ABN, Publish Date - Dec 27 , 2024 | 12:21 AM

Sprouts for grain: అల్పపీడనం కారణంగా గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చాయి.

మక్కువ: సరాయివలసలో మొలకెత్తిన ధాన్యం చూపుతున్న రైతు

  • లబోదిబోమంటున్న రైతులు

  • ప్రభుత్వ ఆదుకోవాలని విన్నపం

జియ్యమ్మవలస/మక్కువ/గరుగుబిల్లి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): అల్పపీడనం కారణంగా గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. జియ్యమ్మవలస గ్రామానికి చెందిన గుంట్రెడ్డి దాలినాయుడు, జాగాన శ్రీనివాసరావు, గుణుపూరు జగన్నాథంనాయుడు, జాగాన భవాని వర్షాలకు ముందే తమ 9.50 ఎకరాల భూమిలో మిషన్‌తో కోతలు కోసి నూర్పులు పూర్తి చేశారు. ఎనిమిది టన్నుల ధాన్యాన్ని జియ్యమ్మవలస పంచాయతీ బొడ్డవలస గ్రామ సమీపంలోని ఓ రైస్‌ మిల్లుకు అమ్మకానికి తీసుకెళ్లారు. అయితే, కొద్దిగా తడిగా ఉన్నాయని, ఆరబెట్టాలని మిల్లు యాజమాన్యం చెబితే మిల్లు ప్రాంగణంలోనే ధాన్యాన్ని ఆరబెట్టారు. ఆ వెంటనే వర్షాలు ప్రారంభకావ డంతో ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చాయి. వాటిని తీసుకునేందుకు మిల్లు యాజమాన్యం అంగీకరించడం లేదు. దీంతో విషయాన్ని స్థానిక వీఆర్‌వో సంధ్య దృష్టికి రైతులు తీసుకెళ్లారు. ఆమె ఈ విషయాన్ని తహసీల్దార్‌కు తెలియజేశారు. వెంటనే ఆయన మండల వ్యవసాయాధికారిణి జ్యోత్స్నతో కలిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. తమకు న్యాయం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే, మక్కువ మండలంలోని సరాయివలస, గరుగుబిల్లి మండలంలోని శివ్వాం, గరుగుబిల్లి తదితర గ్రామాల్లో కూడా ధాన్యానికి మొలకలు వచ్చాయి. గురువారం వర్షం కొంత ఉపశమనం ఇవ్వడంతో టార్పాలిన్లలో భద్రపరిచిన ధాన్యాన్ని రైతులు తెరిచి చూడగా అవి మొలకెత్తి ఉండడంతో లబోదిబోమన్నారు. తడిసిన ధాన్యంతో పాటు మొలకలు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, నష్టం వాటిల్లిన పంటలకు తగిన పరిహారం ఇప్పించేలా అధికారులు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.


తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం

- మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

సాలూరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. గురువారం ఆమె ఫోన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిందని తెలిపారు. రైతులు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.

Updated Date - Dec 27 , 2024 | 12:22 AM