శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
ABN, Publish Date - Dec 31 , 2024 | 12:08 AM
బొబ్బిలి సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు.
రామభద్రపురం, డిసెంబరు 30(ఆంధ్ర జ్యోతి): బొబ్బిలి సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన రామభద్రపురం పోలీసుస్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనం నడిపితే రూ.10వేల జరిమానా విధిస్తామన్నారు. గంజాయిని నిర్మూలించేం దుకు కొట్టక్కి వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశామని తెలి పారు. ఈ ఏడాది సుమారు 850 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్ గుర్తించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతరం రికార్డు లు తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలు పరిశు భ్రంగా ఉంచడంలో రామభద్రపురం ఎస్‌ఐ వెలమల ప్రసాద్ పనితీరును మెచ్చుకున్నారు. ఇటీవల జేసీబీ చోరీ కేసును బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు ఎంతో చాకచక్యంగా ఛేదించారని అన్నారు. బొబ్బిలి సీఐ నారాయణరావు, ఎస్‌ఐ వెలమల ప్రసాద్ పాల్గొన్నారు.
Updated Date - Dec 31 , 2024 | 12:08 AM