ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆటో నుంచి జారి పడి విద్యార్థి మృతి

ABN, Publish Date - Dec 27 , 2024 | 12:26 AM

మండలంలోని మెట్టపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి గునాన భార్గవసాయి (10 గురువారం ఆటో కింద పడి దుర్మరణం పాలయ్యాడు.

సాయి భార్గవ (ఫైల్‌ ఫొటో)

చీపురుపల్లి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మెట్టపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి గునాన భార్గవసాయి (10 గురువారం ఆటో కింద పడి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు అందించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మెట్టపల్లి గ్రామానికి చెందిన గునాన ఈశ్వరరావు, గౌరి దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో పెద్దవాడు భార్గవసాయి చీపురుపల్లి లోని ఓ ప్రవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ ఆటోలో వెళ్లి వస్తున్న సాయి గురువారం కూడా ఎప్పటిలాగే తోటి పిల్లలతో కలిసి ఆటోలో బయల్దేరాడు. అలజంగి సమీపంలోని మలుపు వద్దకు వచ్చే సరికి ఆటోకు ఉన్న సేప్టీ రాడ్‌ తప్పింది. దీంతో ఆటో నుంచి జారి వెనుక చక్రం కింద పడిపోయాడు. తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కుమారుడి మృత దేహం వద్ద బోరున రోదించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:26 AM