40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: అదే వ్యధ... అదే దారుణం!... చిట్టంపాడు ఘటనపై చంద్రబాబు రియాక్షన్

ABN, Publish Date - Jan 23 , 2024 | 01:27 PM

Andhrapradesh: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడులో చిన్నారుల వరుస మరణాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. పెత్తందారు ముఖ్యమంత్రికి ఎలాగూ పేదల గోడు పట్టదు... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా చిట్టంపాడు మరణాలపై దృష్టిపెట్టాలన్నారు.

Chandrababu: అదే వ్యధ... అదే దారుణం!... చిట్టంపాడు ఘటనపై చంద్రబాబు రియాక్షన్

అమరావతి, జనవరి 23: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడులో చిన్నారుల వరుస మరణాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) స్పందించారు. పెత్తందారు ముఖ్యమంత్రికి ఎలాగూ పేదల గోడు పట్టదు... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా చిట్టంపాడు మరణాలపై దృష్టిపెట్టాలన్నారు. అడవి బిడ్డల మరణ ఘోషపై సమీక్ష జరిపి..చర్యలు తీసుకోవాలని టీడీపీ చీఫ్ కోరారు.


చంద్రబాబు ఏమన్నారంటే...

‘‘అదే వ్యధ... అదే దారుణం! విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం చిట్టంపాడులో గంగమ్మ, ఆమె 6 నెలల కొడుకు మరణించి 15 రోజులు కాకముందే అదే గ్రామంలో ఏడాదిన్నర వయసున్న మరో చిన్నారి ప్రవీణ్ చనిపోయాడన్న వార్త మనసును కలచివేసింది. ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి 7 కిలోమీటర్లు మోసుకెళ్లారు. బిడ్డ చనిపోయాక మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ ఇవ్వకపోతే రూ.3 వేలు అప్పుచేసి ప్రైవేటు వాహనంలో రైల్వే స్టేషన్‌కు తెచ్చారు. పేదలు చనిపోతే వారి మృతదేహాలు తరలించడానికి అంబులెన్స్ ఇవ్వరా? ఏమిటీ అమానవీయ పరిస్థితి? ఈ పెత్తందారు ముఖ్యమంత్రికి ఎలాగూ పేదల గోడు పట్టదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరుతున్నా. కనీసం మీరైనా దయచేసి ఆ అడవి బిడ్డల మరణ ఘోషపై ఒక్కసారి సమీక్ష చేయండి. తగు చర్యలు తీసుకోండి!’’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 23 , 2024 | 01:27 PM

Advertising
Advertising