బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
ABN, Publish Date - Dec 28 , 2024 | 12:00 AM
Transform into an Open Defecation-Free District బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మన్యాన్ని తీర్చిదిద్దాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. ప్రతిఒక్కరూ మరుగుదొడ్లు వినియోగించుకోవా లన్నారు. అవసరమైతే మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
మక్కువ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మన్యాన్ని తీర్చిదిద్దాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. ప్రతిఒక్కరూ మరుగుదొడ్లు వినియోగించుకోవా లన్నారు. అవసరమైతే మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. శుక్రవారం అనసభద్ర గ్రామంలో ఆయన పర్యటించారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన కాలువలు, మరుగుదొడ్లు, జలజీవన్‌మిషన్ పథకాల అమలు తీరును పరిశీలించారు. మురుగునీటి కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని, మరుగుదొడ్లు సక్రమంగా వినియోగించడం లేదని గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ కొందరు బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని, వారిలో ముందుగా మార్పు రావాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో మరుగుదొడ్లు లేని ఇళ్లు ఉండరాదన్నారు. స్థలాభావం ఉన్న ఇళ్లకు సంబంధించి ప్రభుత్వ స్థలంలో సామాజిక మరుగుదొడ్లు నిర్మించి, నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని సూచించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చ టించి విద్యా ప్రమాణాలను గమనించారు. ఈ సందర్భంగా ఒకటి రెండు తరగతుల విద్యార్థులు రాసిన వర్క్స్ పరిశీలించారు. పనసభద్ర గ్రామంలో గర్భిణుల రక్తహీనత నివారణపై నిర్వహించిన అవగాహన కార్య క్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి నగేష్‌బాబు, ఎంపీడీవో స్వరూపరాణి, తహసీల్దార్ షేక్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2024 | 12:00 AM