ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

fire accident: బాధితులకు అండగా ఉంటాం

ABN, Publish Date - Dec 29 , 2024 | 11:37 PM

fire accident: : సిరిపురం అగ్ని ప్రమాద బాధితులకు అం డగా ఉంటామని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం సిరిపురం పొందర వీధిలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ఆదివారం పరామర్శించారు.

బాధితులతో మాట్లాడుతున్న కలిశెట్టి అప్పలనాయుడు, మురళీమోహన్‌:

సంతకవిటి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): సిరిపురం అగ్ని ప్రమాద బాధితులకు అం డగా ఉంటామని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం సిరిపురం పొందర వీధిలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ఆదివారం పరామర్శించారు. తొలుత కాలిపోయిన ఇళ్లను పరిశీలించి, ప్రమా దానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. నగదు, సామగ్రి, ఇళ్లు కాలి బూడిదైన కుటుంబ సభ్యులు రోదించారు. ఎమ్మేల్యే, ఎంపీ కలిసి ఒక్కో బాధితుల కుటుంబానికి రూ.10 వేలు చొప్పున అందజేశారు. వివాహానికి దాచుకున్న మంచిరెడ్డి ఈశ్వరి నగదు కాలిబూడిద కావడంతో కుటుంబానికి ఎమ్మెల్యే రెండు లక్షలు, ఎంపీ లక్ష రూపాయలు అందజేస్తామ ని తెలిపారు. బాధితులకు పక్కాఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. బొద్దూరు ఎంపీటీసీ వల్లూరు గణేష్‌ బాధిత కుటుంబాలకు 15 బస్తాల బియ్యం అందజేశారు. అనంతరం బాధితులకు 25 కేజీల బియ్యం, నిత్యవసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోండ్రు జగదీష్‌, టీడీపీ మండలాధ్య క్షుడు గట్టి భాను, రఘు, బొద్దూరు ఎంపీటిసీ వల్లూరు గణేష్‌, చెలికాని మహేశ్‌బాబు, సమతం శ్రీను, రావు రవీంద్ర, వావిలపల్లి శ్రీను పాల్గొన్నారు.ఫ సంతకవిటి మండలంలోని చిత్తారపురానికి చెందిన టీడీపీ నాయకుడు రాకోటి తిరుపతిరావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ పరామర్శించారు.

Updated Date - Dec 29 , 2024 | 11:37 PM