పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:19 AM
మండలంలోని గుజ్జంగివలస గ్రామానికి చెందిన ఉక్కుడు మంజలవాణి (30) గురువారం పురుగు మందు ఆత్మహత్యకు పాల్పడింది.
గుర్ల, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గుజ్జంగివలస గ్రామానికి చెందిన ఉక్కుడు మంజలవాణి (30) గురువారం పురుగు మందు ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు 11 ఏళ్ల కిందట వివాహమైంది. భర్త ట్రాక్టర్ డ్రైవర్. మద్యం తాగి వచ్చి రోజూ ఇంట్లో గొడవ పెడుతున్న నేపథ్యంలో తాగుడు మానేయడని పలుమార్లు మంజులవాణి భర్తను కోరింది. భర్తలో ఎలాంటి మార్పు లేకపోవడంతో బుధవారం రాత్రి గడ్డి మందు తాగింది. విషయం గమనించిన కుటుంబ సభ్యులు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చెందింది. ఈ ఘటనపై ఎస్‌ఐ నారాయణరావు కేసు నమోదు చేశారు. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.
Updated Date - Dec 27 , 2024 | 12:19 AM