ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jagan: పేపర్ బ్యాలెట్‌ వాడాలి: మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Jun 18 , 2024 | 09:29 AM

ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

YS Jagan

అమరావతి: ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియల్లో అభివృద్ధి చెందిన దాదాపు అన్ని ప్రజాస్వామ్య దేశాలు పేపర్ బ్యాలెట్లను ఉపయోగిస్తున్నాయని, ఈవీఎంలను వాడడం లేదని జగన్ అన్నారు. ‘మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని చాటిచెబుతూ మనం కూడా పేపర్ బ్యాలెట్స్ దిశగా అడుగులు వేయాలి’ అని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. కాగా జగన్ వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగానే టీడీపీ, జనసేన కౌంటర్ ఇచ్చాయి.


‘‘ జరిగిన న్యాయం కనిపించాలని ఏవిధంగానైతే కోరుకుంటామో.. అలాగే ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా కనిపించాలి’’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.


ఇలా అనడం అస్సలు బాలేదు ఎమ్మెల్యే గారు: టీడీపీ కౌంటర్

జగన్ వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా టీడీపీ కౌంటర్ ఇచ్చింది. 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతంగా పనిచేశాయని చెప్పి.. 11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనడం అస్సలు బాలేదు పులివెందుల ఎమ్మెల్యే గారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.


కౌంటర్ ఇచ్చిన జనసేన శతఘ్ని

మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై జనసేన శతఘ్ని టీమ్ గట్టి కౌంటర్ ఇచ్చింది.‘‘ నువ్వు పిరికివాడివి కాబట్టి మమ్మల్ని బ్లాక్ చేసుకున్నావ్. అందుకే జనాలు నీ పార్టీని రాష్ట్రం నుంచి బ్లాక్ చేసేశారు. ఇంకా నువ్వు ఈవీఎంల మీద ఏడుస్తున్నావ్. ఈ వీడియోలో ఈవీఎంల పనితీరు గురించి పులివెందుల ఎమ్మెల్యే ఏదో చెప్తున్నాడు. విని తరిస్తావని ఆశిస్తున్నాం. అలాగే ఇలాంటి సచ్చు సలహాలు ఇచ్చే సజ్జల రామకృష్ణా రెడ్డి సలహాలు వింటే ఉన్న 11లో 1 మాత్రమే మిగులుతుంది అని ప్రజలు అంటున్నారు’’ అని పంచ్‌లు పేల్చింది. ‘‘వీలైతే అన్‌బ్లాక్ చెయ్ సరదాగా గత 5 ఏళ్ల అభివృద్ది గురించి మాట్లాడుకుందాం’’ అంటూ ఎక్స్ వేదికగా పేర్కొంది.

Updated Date - Jun 18 , 2024 | 11:12 AM

Advertising
Advertising