హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోండి
ABN, Publish Date - Dec 27 , 2024 | 11:56 PM
ప్రాణాలను రక్షణ కవచం లాంటి హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని వాహనవారులను మదనపల్లె సీఐ రమేష్ కోరారు.
రామసముద్రం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రాణాలను రక్షణ కవచం లాంటి హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని వాహనవారులను మదనపల్లె సీఐ రమేష్ కోరారు. శుక్రవారం రామసముద్రం మండలానికి విచ్చేసిన ఆయన స్థానిక ఎస్‌ఐ వెంకటసుబ్బయ్యతో కలిసి అంబేడ్కర్ సర్కిల్‌లో వాహన దారులకు హెల్మె ట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ హెల్మె ట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలలో వాహనదారులు అధిక సంఖ్యలో మృతి చెందుతున్నారన్నారు. అలాగే మద్యం తాగి వాహనాలను నడపడం నేరమని దీనిని అతిక్రమిస్తే రూ.10వేల జరిమానా తప్పదని హెచ్చరిం చారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది గంగిరెడ్డి, లోకేష్, శాంతకుమారి, కిరణ్‌యాదవ్, బాలాజి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 27 , 2024 | 11:56 PM