216 హైవే విస్తరణ
ABN, Publish Date - Dec 29 , 2024 | 12:32 AM
కత్తిపూడి – ఒంగోలు 250 కిలోమీటర్ల 216 జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)కు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జాతీయ రహదారుల భీమవరం ఏఈ శ్రీనివాసరావు చెప్పారు.
డీపీఆర్‌కు కేంద్రం టెండర్ నోటిఫికేషన్
నరసాపురం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): కత్తిపూడి – ఒంగోలు 250 కిలోమీటర్ల 216 జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)కు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జాతీయ రహదారుల భీమవరం ఏఈ శ్రీనివాసరావు చెప్పారు. కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు కాకినాడ, అమలాపురం, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాలను కలుపుతూ తీరం వెంబడి చేపట్టిన జాతీయ రహదారి పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ట్రాఫిక్ కూడా ఈ రహదారిపై అంచనాకన్నా పెరిగింది. టోల్‌గేట్‌లు లేకపోవడం, దూరం తగ్గడం, ట్రాఫిక్ పెద్దగా లేకపోవడంతో విశాఖ నుంచి చెన్నై, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు వెళ్లే వాహనాలన్ని ఈ మార్గం మీదుగానే వెళుతున్నాయి. జిల్లా నుంచే కాకుండా కోనసీమ నుంచి విజయవాడ వెళ్లే వాహనదారులు ఈ మార్గాన్నే ఎంచుకుం టున్నారు. పెరిగిన ఈ ట్రాఫిక్‌ను గుర్తించిన నేషనల్ హైవే ఈ మార్గాన్ని నాలుగు లైన్లగా మారిస్తే మిగిలిన ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని భావిం చింది. దీనికి అనుగుణంగా విస్తరణ పనులకు సంబంధించి డీపీఆర్ తయారు చేసేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుత రహదారిని ఏ విధంగా నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయాలి, భూసేకరణ, ఖర్చు తదితర అంశాలను టెండర్ దక్కించుకున్న సంస్థ సర్వే చేసి డీపీఆర్‌ను తయారు చేస్తుందని ఎన్‌హెచ్ ఏఈ శ్రీనివాసరావు చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే పనులకు నిధులు విడుదల అవుతాయన్నారు.
Updated Date - Dec 29 , 2024 | 12:32 AM