Dwarka Tirumala: ద్వారకా తిరుమలలో వైభవంగా వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు
ABN, Publish Date - May 20 , 2024 | 01:37 PM
ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు సోమవారం స్వామివారు కాళీయమర్ధన ఆలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల (Dwarka Tirumala) చిన్న వెంకన్న (Chinna Venkanna) ఆలయంలో (Temple) వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు సోమవారం స్వామివారు కాళీయమర్ధన (Kaliyamardhana) ఆలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ఆలయ యాగశాలలో అర్చకులు పుట్టమన్ను తెచ్చి పొలికల్లో పోసి అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తర్వాత గరుడ పటాన్ని ధ్వజస్తంభానికి ఎగురవేసి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు.
కాగా ద్వారకా తిరుమల శ్రీవారి వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 25వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. బ్రహోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయ నిత్యకల్యాణ మండప ఆవరణలో విశేష అలంకరణలో అలివేలు మంగ, ఆండాళ్ అమ్మవార్లు కొలువుతీరగా.. నడుమ ఉన్న చిన్నతిరుమలేశుడు పెండ్లి కుమారునిగా ముస్తాబయ్యారు. ఉభయదేవేరులు పెండ్లి కుమార్తెలయ్యారు. ఉదయం ఏర్పాటు చేసిన సువర్ణ సింహాసనంపై స్వామి, అమ్మవార్ల కల్యాణమూ ర్తులను ఉంచి ఆలయ అర్చకులు హారతులిచ్చి ఈ తంతును నిర్వహించారు. ఈవో త్రినాథరావు ఆద్యంతం పాల్గొని అర్చకులు, పండితులకు దీక్షా వస్త్రాలను అందచేసి అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
శ్రీభూసమేత మహావిష్ణువుగా శ్రీవారు
ఆదిశేషుని పడగన శ్రీభూసమేత మహావిష్ణువు అలంకరణలో శ్రీవారు ఆలయ ప్రాంగణములో భక్తజనులకు దర్శనమిచ్చారు. వైశాఖ మాస బ్రహ్మో త్సవాల్లో భాగంగా రోజుకో అలంకరణలో చినవెంకన్న సాక్షాత్కరిస్తారు.
గజ వాహనంపై శ్రీవారి రాజసం..
గజవాహనంపై ఉభయదేవేరులతో కొలువుతీరిన చిన వెంకన్నస్వామి క్షేత్రపురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల వాహనసేవల్లో భాగంగా తొలిరోజు శ్రీవారు, అమ్మవార్లు గజవాహనాన్ని అధిరోహించి తిరువీథుల్లో భక్తులను అభయహస్తాన్ని అందించారు. తొలుత ఆలయంలో స్వామి, అమ్మవార్లను గజవాహనంపై ఉంచి అలంకరించి మేళతాళాలు, మంగళవాయిద్యాలు నడుమ అట్టహాసంగా గ్రామంలో ఊరేగించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిట్ దర్యాప్తులో అసలు వాస్తవాలు..!
జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే
చంద్రబాబుతో టచ్‌లోకి ఏపీ అధికారులు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - May 20 , 2024 | 02:31 PM