క్రిటికల్ కేర్ ఆస్పత్రికి రూ.30 కోట్లు ఇవ్వండి
ABN, Publish Date - Dec 19 , 2024 | 12:51 AM
భీమవరంలోని గొల్లవానితిప్ప రోడ్డులో 100 పడకల ఆసుపత్రి స్థలంలో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి అవసరమైన రూ.30 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రాష్ట్ర మంత్రి సత్య కుమార్‌ను కోరారు.
రాష్ట్ర వైద్య శాఖా మంత్రి సత్యకుమార్‌కు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ వినతి
భీమవరం టౌన్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): భీమవరంలోని గొల్లవానితిప్ప రోడ్డులో 100 పడకల ఆసుపత్రి స్థలంలో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి అవసరమైన రూ.30 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రాష్ట్ర మంత్రి సత్య కుమార్‌ను కోరారు. ఢిల్లీలో బుధవారం కేంద్ర మంత్రు లు శ్రీనివాసవర్మ, నితిన్ గడ్కరీతో మంత్రి సత్యకుమార్ భేటీ అయ్యారు. భీమవంల క్రిటికల్ కేర్ విభాగం సమస్యను వర్మ సత్యకుమార్‌కు వివరించారు. నూతన జిల్లాల పునర్వ్యవస్థీకరణ లో భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పడిందన్నారు. జిల్లా ఆసుపత్రి లేదని, ప్రస్తు తం 50 పడకల ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేశారని వివరించారు. అత్యవసర కేసుల నిమి త్తం క్రిటికల్ కేర్ బ్లాక్ అవసరమని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమే హం, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలకు ప్రత్యేక విభాగం అవసరం ఉందన్నారు. గొల్ల వానితిప్ప రోడ్డులో ప్రస్తుతం కొనసాగుతున్న 100 పడకల కొత్త ఏరియా ఆసుపత్రి – భీమవరం స్థలంలో కొత్త 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను నిర్మించడానికి సరిపోతుందని వివరించారు. ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన రూ. 30 కోట్లు మంజూరు చెయ్యాలని ఆయన కోరారు.
కోడేరు వారధికి నిధులు ఇవ్వండి
ఆచంట ఎమ్మెల్యే పితాని వినతి
పెనుమంట్ర: వశిష్ఠ గోదావరిపై పి.గన్నవరం – కోడేరు వారధి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారా యణ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కోరారు. ఢిల్లీలో బుధవారం కేంద్రమంత్రిని కలిసి వారధి డిజైన్, అవసరాన్ని వివరించారు. గోదావరి జిల్లా ల నడుమ రాకపోకలు సులభతరం కావడంతో పాటు లంకలో పండించిన పంటను మార్కెట్‌కు తరలించడానికి ఆస్కారం ఉంటుందన్నారు. గోదావరి వరద సమయంలో ప్రాణ నష్టం జరగకుండా నివారించవచ్చునని నితిన్ గడ్కరీకి పితాని సత్యనారాయణ వివరించారు. నితిన్ గడ్కరీ నిధులు మంజూరు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు పితాని సత్యనారాయణ తెలిపారు.
Updated Date - Dec 19 , 2024 | 12:51 AM