ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్‌

ABN, Publish Date - Dec 20 , 2024 | 12:21 AM

రీసర్వేలో గతంలో వచ్చిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అలాంటి తప్పులు దొర్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి అన్నారు.

పాందువ్వలో రైతుతో మాట్లాడుతున్న కలెక్టర్‌ చదలవాడ నాగరాణి

ఉండి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రీసర్వేలో గతంలో వచ్చిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అలాంటి తప్పులు దొర్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి అన్నారు. రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని ఆమె తెలిపారు. గురువారం పాందువ్వలో రెవెన్యూ సదస్సుకు ఆమె విచ్చేశారు. గ్రామసదస్సులో వచ్చిన వినతులను ఆమె పరిశీలించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరు నాగరాణి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో రైతులు, ప్రజలు నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే పరిష్కారానికి ఆదేశించినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన రైతులు కోటిపల్లి వెంకటనారాయణ దరఖాస్తూ అందజేస్తూ తనకు 50సెంట్లు భూమి వాస్తవంగా వుండాలని ప్రస్తుతం 44సెంట్లు మాత్రమే లెక్కలోకి వస్తుందని, తనకు తగిన న్యాయం చేయాలని కలెక్టరును కోరారు. వేగేశ్న లక్ష్మీకుమారి, గండు లక్ష్మీ శారద, ఎస్‌.సుబ్బలక్ష్మీ, కునాధరాజు రామకృష్ణంరాజు, మాదాసు వెంకన్న తదితరుల ఆర్జీలను సమర్పిస్తూ మ్యూటేషన్‌ చేయాలని ఆమె కోరారు.

ఎంపీపీ పాఠశాల సందర్శన

పాందువ్వలోని ఎంపీపీ పాఠశాలను కలెక్టర్‌ సందర్శించారు. పాఠశాలలో ఎంతమంది విద్యను అభ్యసిస్తున్నారు? హైస్కూల్‌ చదువుకు ఎక్కడికి వెళ్తున్నారు? ఒక కుటుంబంలోని పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారా? అంటూ హెచ్‌ఎం రామకృష్ణంరాజును ఆరా తీశారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా కలెక్టర్‌ సందర్శించారు. చిన్నారులను వారి పేర్లు అడిగి వారితో పాటలు పాడించుకుని సంతోషం వ్యక్తంచేశారు. మెనూప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని అంగన్‌వాడీలకు సూచించారు. గ్రామంలోని పలువురు మహిళలు కలెక్టరు వాహనాన్ని ఆపి తమ ప్రాంతంలో డ్రెయినేజీ లేక ఇబ్బందిపడుతున్నట్లు ఆమె దృష్టికి తీసుకుని వెళ్లారు. ఉండి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా సందర్శించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయాలన్నారు. పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

Updated Date - Dec 20 , 2024 | 12:21 AM