ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Dwarka Tirumala: హనుమాన్ అలంకరణలో దర్శనమిచ్చిన చిన్న వెంకన్న

ABN, Publish Date - May 21 , 2024 | 10:58 AM

ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నాల్గవ రోజు మంగళవారం స్వామివారు రామ లక్ష్మణ సమేత హనుమాన్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఏలూరు జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల (Dwarka Tirumala) చిన్న వెంకన్న (Chinna Venkanna) ఆలయంలో (Temple) వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నాల్గవ రోజు మంగళవారం స్వామివారు రామ లక్ష్మణ సమేత హనుమాన్ (Hanuman) అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే హనుమద్వాహనంపై స్వామివారిని ఊరేగించారు. స్వామివారిని దర్శించుకునేందుకు రోడ్లపైకి తరలి వచ్చారు. కాగా రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. అనంతరం వెండి శేష వాహనంపై స్వామివారిని అధికారులు ఊరేగిస్తారు.


ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు సోమవారం స్వామివారు కాళీయమర్ధన (Kaliyamardhana) ఆలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కాగా ద్వారకా తిరుమల శ్రీవారి వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 25వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. బ్రహోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయ నిత్యకల్యాణ మండప ఆవరణలో విశేష అలంకరణలో అలివేలు మంగ, ఆండాళ్‌ అమ్మవార్లు కొలువుతీరగా.. నడుమ ఉన్న చిన్నతిరుమలేశుడు పెండ్లి కుమారునిగా ముస్తాబయ్యారు. ఉభయదేవేరులు పెండ్లి కుమార్తెలయ్యారు. ఉదయం ఏర్పాటు చేసిన సువర్ణ సింహాసనంపై స్వామి, అమ్మవార్ల కల్యాణమూ ర్తులను ఉంచి ఆలయ అర్చకులు హారతులిచ్చి ఈ తంతును నిర్వహించారు. ఈవో త్రినాథరావు ఆద్యంతం పాల్గొని అర్చకులు, పండితులకు దీక్షా వస్త్రాలను అందచేసి అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డీజీపీ వాట్సాప్ ఫోటోతో కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌

హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన గోవిందరాజ స్వామి

ఏపీలో ఐప్యాక్ కార్యాలయం మూసివేత..!

సన్నాలకు బోనస్‌..

ఎవరికి ఎన్ని సీట్లో?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 21 , 2024 | 11:04 AM

Advertising
Advertising