ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ సొమ్ము బొక్కేశారు..

ABN, Publish Date - Dec 23 , 2024 | 12:22 AM

వీరంతా ప్రభుత్వ ఉద్యోగులు.. సీనియార్టీని బట్టి లక్షల్లో జీతాలు ఉంటాయి. అయినా వీరి ఆశకు హద్దులేదు. పన్నుల రూపంలో వసూలైన సొమ్ములు, పేదలకు చెందాల్సిన పథకాల సొమ్ములు బొక్కేశారు. ఉన్నతాధికారుల దర్యాప్తులో ఒక్కో అవినీతి బండారం బయటపడుతున్నది. అరెస్టులు, నిధుల రికవరీకి రంగం సిద్ధమైంది.

  • రూ. 2.30 కోట్ల పంచాయతీ సొమ్ము పక్కదారి

  • కేసు నమోదు

  • సస్పెన్షన్‌ కోసం ప్రభుత్వానికి సిఫారసు

  • చిన అమిరం పంచాయతీలోనూ దందా

భీమవరం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పంచాయతీలో లక్షలాది రూపాయలు పక్కదారి పట్టించిన ఘనుడు అతడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన చెప్పిందే వేదం. కార్యదర్శులుగా ఉంటూ కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన సాగిరాజు కిశోర్‌ గోపాలకృష్ణంరాజు(కిశోర్‌ రాజు), బి.జయరాజులపై జిల్లా అధికార యంత్రాంగం కొరడా ఝుళిపించింది. పంచాయతీ నిధులు దుర్వినియోగానికి పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని జాల్లా కలెక్టర్‌ ఇటీవల ఆదేశాలు జారీచేశారు. నిధులు పక్కదారి పట్టించడంలో వెనుక ఉన్న సూత్రదారులపైనా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. భీమవరం రూరల్‌ మండలం రాయలం పంచాయతీలో వైసీపీ ప్రభుత్వంలో కిశోర్‌ రాజు, బి.జయరాజులు కార్యదర్శులుగా వ్యవహరించారు. వీరి హయాంలో రూ.2.30 కోట్లు ఆస్తి పన్ను పక్కదారి పట్టింది. ముందుగా జయరాజు కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత కిశోర్‌ రాజు ఇన్‌ఛార్జ్‌గా కొనసాగారు. కిశోర్‌ రాజు ఏకంగా రూ. 1.30 కోట్లు తన సొంత అకౌంట్‌లో జమ చేసుకున్నట్టు జిల్లా అధికారుల విచారణలో తేలింది. వీరికి జూనియర్‌ అసిస్టెంట్‌ సహకరించారు. ముగ్గురిపైనా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.


కిశోర్‌ రాజుపై అరెస్ట్‌వారెంట్‌ కూడా జారీ అయినట్టు సమాచారం. అవినీతి దందాలో కార్యదర్శి కిశోర్‌ రాజు ప్రమేయం ఎక్కువగా ఉందని అధికారులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏజన్సీ ప్రాంతానికి ఆయనను బదిలీ చేశారు. పోలవరం నియోజకవర్గంలోని కుక్కునూరు మండలానికి బదిలీపై వెళ్లారు. ఇదే జిల్లాలో ఉండేందుకు కిశోర్‌రాజు చేయని ప్రయత్నం లేదు. అయినా జిల్లా అధికారులు అతని దందాను ముందుగానే పసిగట్టారు. ఏజన్సీ ప్రాంతానికి బదిలీ చేసేశారు. అలాగే పాలకొల్లు ఏరియా హాస్పిటల్లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కుంచె మురళి వెంక ట తులసీధర్‌ (26)ను ప్రభుత్వ నిధులు దుర్వినియోగం, చెక్కుల ఫోర్జరీ కేసులో శనివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సుమారు రూ. 62లక్షల వరకు నిధులు దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పేషెంట్‌ కేర్‌ అకౌంట్‌, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ అకౌంట్‌, పి.ఎఫ్‌.ఎం.ఎస్‌ అకౌంట్‌లకు సంబంధించి లావాదేవీల విషయంలో నిధులు దుర్వినియోగం బయటపడింది.


రాయలం ఆదాయం రూ. కోటి

రాయలం గ్రామ పంచాయతీలో ప్రతిఏటా ఆస్తి పన్ను రూపంలో కోటి రూపాయలు ఆదాయం వస్తుంది. ముందుగా జయరాజు అవతవకలకు తెరతీశారు. ఆ తర్వాత ఇన్‌చార్జిగా వచ్చిన కార్యదర్శి కిశోర్‌ రాజు అవినీతిని తారాస్థాయికి తీసుకువెళ్లారు. ఆస్తిపన్నును వసూలు చేసి ఏకంగా రూ.1.30 కోట్లు తన సొంత అకౌంట్‌లో వేసుకున్నట్టు అధికారుల విచారణలో తేలింది. అవినీతికి పాల్పడ్డ కార్యదర్శులను సస్పెండ్‌ చేయాలని పంచాయతీ రాజ్‌ కమిషనర్‌కు జిల్లా అధికారులు లేఖ రాశారు.


పన్ను ఎందుకు కట్టాలి..

రాయలం గ్రామ పంచాయతీ నైసర్గికంగా భీమవరం పట్టణంలో కలిసిపోయింది. అక్కడే అపార్ట్‌మెంట్‌లు వెలు స్తున్నాయి. స్థలాలు ధరలు భీమవరంతో పోటీ పడుతున్నా యి. ప్లాన్‌లకు డిమాండ్‌ ఉంటోంది. ప్రతిఏటా కోటి రూపాయల ఆస్తి పన్ను వస్తుందంటే పంచాయతీ సామర్థ్యం ఎంతగా ఉందో అర్థమవుతుంది. కార్మదర్శుల అవినీతి భాగో తం తర్వాత పన్ను చెల్లించడానికి ప్రజలు ఎదురుతిరు గుతున్నారు. సొంతంగా సొమ్ములు తినేయడానికా పన్ను చెల్లించాలంటూ ప్రశ్నిస్తున్నారు. రాయలం పంచాయతీలో పన్ను వసూలు చేయడం ఇప్పటి సిబ్బందికి సవాల్‌గా మారింది. పంచాయతీలో గత రికార్డులన్నీ జిల్లా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు పూర్తి చేశారు.


దందా అంతా ఇంతా కాదు!

నాటి ఎమ్మెల్యే భరోసా వల్లే కార్యదర్శులు ప్రత్యేకంగా కిశోర్‌ రాజు బరితెగించారు. చిన అమీరం గ్రామ పంచా యతీకి రెగ్యులర్‌ కార్యదర్శిగా పనిచేశారు. రాయలం గ్రామ పంచాయతీకి ఇన్‌చార్జిగా కొనసాగారు. రెండు పంచాయ తీలు భీమవరం పట్టణానికి ఆనుకునే ఉన్నాయి. భీమవరం అంతా ఆ రెండు పంచాయతీల్లో విస్తరించింది. చిన అమి రం గ్రామ పంచాయతీలోనూ కిశోర్‌రాజు దందా అంతా ఇంతా కాదు. అక్రమ లేఅవుట్‌లలో ప్లాన్‌లు తీసుకోకు ండానే ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించారు. వైసీపీ హయాంలో రూరల్‌ మండల ప్రజాప్రతినిధి చినఅమిరంలో నాన్‌ అవుట్‌ వేస్తే జిల్లా పరిషత్‌ నిధులతో రహదారి వేసేందుకు పూర్తి సహకారం అందించారు. సదరు రహదా రిని స్థల యజమానులు పంచాయతీకి రాసిచ్చారు. పంచా యతీ అనుమతి లేనిదే జిల్లా పరిషత్‌ నిధులతో రహదారి వేయడానికి వీలులేదు. పంచాయతీ స్థలం కాబట్టి రహదారి వేశామంటూ కార్యదర్శి కిశోర్‌ రోజు తనను ప్రశ్నించిన వారికి వింత సమాధానం ఇస్తూ వచ్చారు. కానీ అక్కడ నివాసాలు లేవు. అయినా రహదారి వేయడంలో కార్యదర్శి ప్రధాన భూమిక వహించారు. అప్పటి ఎమ్మెల్యే సహకారం వల్లే కార్యదర్శి కిశోర్‌ రాజు రాయలం, చిన అమిరం పంచాయతీలో పెద్దమొత్తంలో సొమ్ములు కాజేసుకున్నా రన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా చినఅమిరం పంచాయతీలోనూ విచారణ సాగుతోంది. అక్కడ ఎంత నిధులు దుర్వినియోగం అయ్యాయో విచారణ తర్వాత వెల్లడి కానుంది.

Updated Date - Dec 23 , 2024 | 11:40 AM