Aqua Farmers: ఫంగస్ అధరహో..
ABN, Publish Date - Dec 10 , 2024 | 09:21 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తం ప్రభుత్వ విధానాల ఫలితంగా చేపల మేత ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఓ పక్క అధిక విద్యుత్ ధరల భారం ఇతర ఖర్చులు పెరగడంతో పాటు మార్కెట్ ట్రేడర్లు చేపల ధరలు తగించి కొనుగోలు చేసేవారు.
నిడమర్రు: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆక్వా రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. మార్కెట్లో ఫంగస్ రూప్ చంద్ రేట్లు పెరగడంతో చేపల మార్కెట్లు కళకళలాడుతున్నాయి. సాధారణంగా ఫంగస్ చేపలకు మార్కెట్ జనవరి నుంచి మే నెల వరకు అత్యధిక ధర పలుకుతుంది. జూన్, జూలైలో సముద్రం చేపలు సంవృద్ధిగా లభించడం, పండుగల వల్ల ఈ కాలంలో దర తక్కు పగా ఉంటుంది. కానీ నేడు ధరలు పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేజీ ఫంగస్.. చేపల సాగుకు రైతుకు అన్నీ కలిపి సుమారు - 75 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం కేజీ రూ. 85 పలుకుతోంది. దీంతో రైతుకు రూ.15 నుంచి రూ.20 గిట్టుబాటు. అవుతుంది.
గత ప్రభుత్వ హయాంలో అంతానష్టమే..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తం ప్రభుత్వ విధానాల ఫలితంగా చేపల మేత ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఓ పక్క అధిక విద్యుత్ ధరల భారం ఇతర ఖర్చులు పెరగడంతో పాటు మార్కెట్ ట్రేడర్లు చేపల ధరలు తగించి కొనుగోలు చేసేవారు. కంపెనీల తరఫున అనధికారికంగా అప్పటి కొందరు అధికార పార్టీ పెద్దలకు మామూళ్ళు ఇవ్వాల్సి రావడంతో మార్కెట్ రేటు బాగున్నా రైతుకు గిట్లు బాటు ధరను ట్రేడర్స్ ఇవ్వ లేకపోయేవారు. నేడు కూటమి ప్రభుత్వం రాకతో మామూళ్ల బెడద తొలగి పోవడంతో ట్రేడర్స్ స్వేచ్ఛగా వ్యాపారాలు నిర్వహిస్తూ రైతుకు మార్కెట్ ధర ఇవ్వడతో రైతులు లాభాల బాట పట్టారు.
తగ్గిన ఫంగస్ సాగు
గత ప్రభుత్వ విధానాల వల్ల ఫంగస్ సాగు పూర్తిగా తగ్గిపోయింది. పదెకరాల కన్నా ఎక్కువ ఉన్న చెరువులకు ఆక్వా విద్యుత్ సబ్సిడి లేకపోవడంతో బిల్లులు వేలాది రూపాయలు రావడంతో రైతులు బెంబేలెత్తి పోయి తమ చెరువులను చిన్న చెరువులుగా చేసి రొయ్యల సాగు ప్రారంభించారు. కానీ రొయ్యల సాగులోను తీవ్ర నష్టాలు రావడంతో ముందుకు సాగలేక చతికిల పడ్డారు. దీంతో ఫంగస్ చెరువుల సాగు పూర్తిగా తగ్గిపోయింది. చాలా మంది రైతులు తమ చెరువులను అయినకాడికి లీజులకిచ్చేశారు. నేడు ప్రభుత్వ విధానాలు మారడం.. చేపల ధరలు పెరగడంతో మళ్లీ పాత రోజులు వచ్చాయని ఆశ పడుతున్నారు.
ఫంగస్ చేప తయారీకి అయ్యే ఖర్చు...
చేపపిల్ల ఖరీదు (5 అంగుళాలు) రూ. 5, చెరువులో నీటి తోడకం రూ. 10, మేత ఖరీదు రూ. 40, విద్యుత్ ఖర్చు రూ. 5, చెరువు లీజు ఖర్చు రూ. 5. ఇతర ఖర్చు రూ. 5. మొత్తం ఖర్చు రూ. 70.
రైతుకు లాభాల బాట.. పూసల వెంకటేశ్వరరావు ఆక్వారైతు, చిలకంపాడు.
‘‘గత ప్రభుత్వ హయాంలో విధానపర లోపాలవల్ల ఆక్వా రంగం పూర్తిగా దెబ్బతింది. చేపల సాగు చేసిన రైతులు, నష్టాలు చివిచూడాల్సి వచ్చింది. నేడు కూటమి ప్రభుత్వంలో మార్కెట్లో నిలకడ వచ్చి చేపల రేట్లు పెరగడంతో రైతు లాభాల బాట పట్టాడు’’.
ఆక్వా రంగాన్ని ఆదుకోవాలి.. తెలగారెడ్డి వెంకటేశ్వరరావు, గణపవరం
‘‘ఫంగస్ మేలో పలికే ధర డిసెంబర్‌లో రావడం ఆనందంగా ఉంది. చితికి పోయిన ఆక్వా రంగాన్ని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నూతన మత్స్య విధానం ద్వారా ఆక్వా రంగాన్ని ఆదుకోవాలి’’.
ఈ వార్తలు కూడా చదవండి..
మోహన్‌బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ ఏమన్నారంటే..
పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 10 , 2024 | 09:21 AM