ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Janasena Vs TDP: టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ..

ABN, Publish Date - Oct 31 , 2024 | 01:00 PM

గురువారం దీపావళి సందర్భంగా ఏలూరు జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో ఒకరోజు ముందుగానే అధికారులు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తమకు కనీస సమాచారం అందించకుండా పెన్షన్ పంపిణీ చేయడం ఏంటి అని టీడీపీ నేతలను, అధికారులను జనసేన నాయకులు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

ఏలూరు జిల్లా: చింతపాడులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పెన్షన్ పంపిణీ (Pension Distribution) కార్యక్రమంలో టీడీపీ (TDP), జనసేన (Janasena) కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా పెన్షన్ పంపిణీ చేయడంపై జనసేన కార్యకర్తలు, టీడీపీ నేతలు, అధికారులను నిలదీశారు. దీంతో మాటా మాటా పెరిగి ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటలో జనసేన గ్రామ అధ్యక్షుడు మోరు రామకృష్ణకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


కాగా గురువారం దీపావళి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో ఒకరోజు ముందుగానే అధికారులు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తమకు కనీస సమాచారం అందించకుండా పెన్షన్ పంపిణీ చేయడం ఏంటి అని టీడీపీ నేతలను, అధికారులను జనసేన నాయకులు ప్రశ్నించారు. కాగా అస్పత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతుండడంతో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు వచ్చారు. దీంతో ఆస్పత్రి వద్ద కూడా ఉద్రిక్తత నెలొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి పేరుతో అక్రమ దందాలు.. ముఠా అరెస్ట్..

కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్..

జగన్ మీడియాకు ఎప్పుడో తాళాలు పడేవి ..

అట్టహాసంగా నరకాసుర వధ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 31 , 2024 | 01:00 PM