ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గోదావరి డెల్టాకు పూర్వ వైభవం

ABN, Publish Date - Dec 25 , 2024 | 12:43 AM

గోదావరి డెల్టాకు పూర్వ వైభవం తీసుకొస్తానని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో మంగళవారం స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో జిల్లాలో 27 గ్రామాలకు రూ.1.67 కోట్ల విలువైన ట్రాక్టర్లను ప్రారంభించి మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల రామానాయుడు, చిత్రంలో ఎమ్మెల్యే బొలిశెట్టి, టీడీపీ ఇన్‌చార్జ్‌ వలవల తదితరులు

తాడేపల్లిగూడెం రూరల్‌, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి):గోదావరి డెల్టాకు పూర్వ వైభవం తీసుకొస్తానని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో మంగళవారం స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో జిల్లాలో 27 గ్రామాలకు రూ.1.67 కోట్ల విలువైన ట్రాక్టర్లను ప్రారంభించి మాట్లాడారు. నీటిపారుదల శాఖ మంత్రిగా గోదావరి డెల్టాను సమూలంగా ఆధునికీకరిస్తా. పరిసరాల పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామాలకు ట్రాక్టర్‌లు అందిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వారి మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లే సిగ్గుపడేలా పాలన సాగించారు. ఫిల్టర్‌ బెడ్‌లు మార్చుకోలేక, చెత్త రిక్షాల వారికి జీతాలు చెల్లించలేక అవస్థలు పడ్డారు. కూటమి ప్రభుత్వం పల్లెలకు పునరుజ్జీవం సాధించే దిశగా పాలన ముందుకు సాగుతోంది’ అని అన్నారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రాన్ని చెత్త మయంగా తయారు చేసిన ఘనత జగన్‌ది అయితే.. చెత్త నుంచి సుందర గ్రామాలుగా మారుస్తున్నది కూటమి ప్రభుత్వం అని అన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చాఆర్జ్‌ వలవల బాబ్జి, బీజేపీ కన్వీనర్‌ ఈతకోట తాతాజి, జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి, డీపీవో ఎం.అరుణశ్రీ, ఆర్డీవో ఖతిఫ్‌ కౌసర్‌ భనో, సర్పంచ్‌ పోతుల అన్నవరం, టీడీపీ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్‌, ఐసర్‌ ట్రాక్టర్‌ కంపెనీ డీలర్‌ కూచిపూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 12:43 AM