ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు
ABN, Publish Date - Dec 20 , 2024 | 12:34 AM
శ్రీవారి క్షేత్రం వద్ద పలు దుకాణాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు.
ద్వారకాతిరుమలలో దుకాణదారులకు నోటీసులు
ద్వారకాతిరుమల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి క్షేత్రం వద్ద పలు దుకాణాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. పారిశుధ్యం మెరుగుప రిచే దిశగా ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు విక్రయాలు నిలిపి వేయాలని సూచించారు. వాటి వల్ల నష్టాలను దుకాణయ జమానులకు గ్రామ కార్యదర్శి జిటి శ్రీనివాస్, మహిళా పోలీసు పి.లక్ష్మీసుజన తదితరులు వివ రించారు. భూమిలో చేరి పర్యావరణానికి తీరని నష్టం కలుగచేస్తాయన్నారు. చిరు వ్యాపారులు 20 మిల్లీ మైక్రాన్ల కంటే తక్కువ మందం కల్గిన ప్లాస్టిక్ సంచులను వినియోగించవద్దని సూచిం చారు. చిన్న వెంకన్న పుణ్యక్షేత్రానికి వేలాది సంఖ్యలో భక్తులు వస్తారని, వారి అవసరాలకు మందమైన కవర్లు, వస్తువులు వాడాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది మల్లీశ్వరి, నరేష్, తేజ తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ వాడకంతో అనర్ధాలు
భీమవరం టౌన్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి ప్రతి ఒక్క రూ గుడ్డ సంచులనే వినియోగించాలని మునిసి పల్ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర రావు అన్నారు. శ్రీవిజ్ఞాన వేదిక, పురపాలక సం ఘం సంయుక్త ఆధ్వర్యంలో కేజీఆర్‌ఎల్ జూని యర్ కళాశాలల్లో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ సదస్సు ప్రతిజ్ఞ నిర్వహించారు. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంపై వ్యాపార దుకాణాల్లో తనిఖీలు చేపట్టి జరిమానాలు హెచ్చరికలు చేశామన్నారు. ఇకపై ప్లాస్టిక్ వాడ కం కనిపిస్తే జరిమానాలు తప్పవన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థులు నిర్లక్షరాస్యులకు తెలియ జెప్పాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగం విడనాడాలన్నారు. చెరుకు వాడ రంగసాయి విద్యార్థులతో ప్రతిజ్ఞ నిర్వహిం చి ప్లాస్టిక్ బ్యాగ్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషే ధించాలని, గుడ్డ సంచులనే వాడాలని సూచించా రు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ విప్పర్తి వెంకట రత్నం, గుత్తుల హేమలత, తాడిపత్రి రమ్య, మాధవి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 20 , 2024 | 12:34 AM