ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రాజెక్ట్‌ కమిటీ ఎన్నికకు సిద్ధం

ABN, Publish Date - Dec 20 , 2024 | 12:16 AM

జల వనరుల శాఖ లో వెస్ట్రన్‌ డెల్టా ప్రాజెక్ట్‌ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 21వ తేదీన భీమవరం కలెక్టర్‌ కార్యాలయంలో కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షు లను ఎన్నుకోనున్నట్టు జిల్లా కలెక్టర్‌ నాగరాణి ప్రకటించారు.

జూ మురళీరాజుకు అవకాశం జూ కూటమిలో సయోధ్య

జూ రేపు ఎన్నిక లాంఛ నమే

భీమవరం/భీమవరం రూరల్‌, డిసెంబ రు 19 (ఆంధ్రజ్యోతి): జల వనరుల శాఖ లో వెస్ట్రన్‌ డెల్టా ప్రాజెక్ట్‌ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 21వ తేదీన భీమవరం కలెక్టర్‌ కార్యాలయంలో కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షు లను ఎన్నుకోనున్నట్టు జిల్లా కలెక్టర్‌ నాగరాణి ప్రకటించారు. కూటమి తరపు న ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ అభ్యర్థిని ఇప్పటికే ఖరారు చేశారు. పాలకోడేరు మండలానికి చెందిన మురళీరాజును కూటమి ప్రతిపాదిస్తోంది. నరసాపురం నుంచి ప్రాజెక్ట్‌ కమిటీపై పోటీ ఏర్పడింది. తమకు అవకాశం ఇవ్వాలంటూ అక్కడ ఎమ్మెల్యే నాయకర్‌ పట్టుబట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి మురళీరాజు తెలుగు దేశం పార్టీకి సేవలందించారు. గత తెలు గుదేశం ప్రభుత్వ హయంలో మురళీ రాజు పేరు తెరపైకి వచ్చింది. వంతుల ప్రాతిపదికన రెండేళ్లు మురళీరాజు ప్రాజెక్ట్‌ కమిటీ బాధ్యతలు అప్పగించాలని అప్పట్లో నిర్ణయించారు. అయితే పొత్తూరి రామ రాజుకు అంతిమంగా కమిటీ చైర్మన్‌గా నాడు నియమించారు. మునిసిపాలిటీ ఎ న్నికల్లో వ్యయప్రయాసలకు ఓర్చి కష్టప డిన రామరాజుకు ఇవ్వడం సముచితంగా ఉంటుందని అప్పట్లో రామానాయుడు ప్రతిపాధించారు. దానికే అంతా మొగ్గు చూపి పొత్తూరి రామరాజుకు ప్రాజెక్ట్‌ కమిటీ చై ర్మన్‌గా నియమించారు. వైసీపీ హయాంలో నీటి సంఘాలను రద్దు చేశారు. ఎన్నికలు నిర్వహించలేదు. తెలు గుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ నీటి సంఘాలకు ప్రాధా న్యం ఇచ్చారు. ఇప్పటికే నీటి వినియో గదారులు, నీటి పంపిణీ సంఘాలకు పశ్చి మ డెల్టా పరిధిలో ఎన్నిక పూర్తయ్యింది. నీటి పంపి ణీ సంఘాల అధ్యక్షులు ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. తెలుగుదేశం కూటమి నేతలే నీటి పంపిణీ సంఘాల అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వైసీ పీ ముందుగానే చేతులెత్తేసింది. ప్రాజె క్ట్‌ కమిటీ చైర్మన్‌ పదవికి కూడా కూటమి లో పోటీ లేకుండా నేతలు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. మురళీరాజును ప్రతిపాది ంచారు. నర్సాపురం నియోజకవర్గం నుంచి డిమాండ్‌ వినిపించినా సరే ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీకి సేవల ందిస్తూ వచ్చిన మురళీరాజు వైపే కూట మి ఆసక్తి చూపింది. తాడేపల్లిగూడెం నియోజకవ ర్గంలో మరో విధమైన ఆవేదన వ్యక్తమైంది. ఇప్పటిదాకా ప్రకటించిన నా మినేటెడ్‌, ఇత ర పదవుల్లో తాడేపల్లిగూడెం నియోజక వర్గానికి ప్రాధాన్యం దక్కలేదు. తాడేపల్లి గూడెం నియోజకవర్గంలో గడచిన 20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. తాజాగా పదవుల కేటాయింపులో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి అన్యా యం జరుగుతుందన్న విషయాన్ని అధి ష్ఠానం దృష్టికి తీసుకువె ళ్లాలని జిల్లా నాయకత్వంపై ఒత్తిడి పెంచారు. ప్రాజెక్ట్‌ కమిటీ విషయంలో మురళీరాజువైపే మొగ్గుచూపారు. ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 14 డీసీలు, తూర్పు గోదావరి జిల్లా నుంచి 2 డీసీలు, ఏలూరు జిల్లా నుంచి 4 డీసీలు మొత్తం 20 నీటి పంపిణీ సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులతో డెల్టా ప్రాజెక్ట్‌ కమిటీకి ఒక అధ్యక్ష, ఒక ఉపాధ్యక్ష పదవులను ఎన్నుకోవడం జరుగుతుంది.

Updated Date - Dec 20 , 2024 | 12:19 AM