ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghurama: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన రఘురామ

ABN, Publish Date - Jan 16 , 2024 | 01:59 PM

ప.గో.జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కేసులో 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టంగా చెప్పారన్నారు.

ప.గో.జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కేసులో 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టంగా చెప్పారన్నారు. మరో న్యాయమూర్తి ద్వివేది ఆ సెక్షన్ వర్తించదన్నారని, రెండు తీర్పులు విడివిడిగా ఇచ్చారన్నారు. అనంతరం ఈ కేసును ద్విసభ్య బెంచ్ నుంచి త్రిసభ్య ధర్మాసనానికి నివేదించారన్నారు.

అయితే త్రి సభ్య ధర్మాసనం ఎంత వేగంగా విచారించిన తీర్పు రావడానికి మరో ఆరు నెలలు పడుతుందని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చింది కాబట్టి ఇబ్బంది ఉండదన్నారు. బెబ్బులిపులి సినిమాలో కోర్టు కోర్టుకు తీర్పు మారుతుంది అన్నట్లుగా కోర్టు తీర్పులు మారుతుంటాయన్నారు. రాబోయే రోజుల్లో అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిద్దామని అన్నారు. ఎన్నికలకు హుషారుగా వెళదామని, ఏ ఇబ్బంది లేదన్నారు. సంబరాలు చేసుకున్న తప్పులేదని.. పూర్తిస్థాయి తీర్పు వస్తే ఇంకా బాగుండేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 16 , 2024 | 02:30 PM

Advertising
Advertising