ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: ఈ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు రేపు సెలవు

ABN, Publish Date - Sep 08 , 2024 | 09:08 PM

రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు(సోమవారం) పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.

ఏలూరు: రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. బంగాళఖాతంలో అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు(సోమవారం) పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. అల్పపీడనం, భారీ వర్షాలు కారణంగా రేపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, అంగన్వాడి సెంటర్లకు సెలవు ఇస్తున్నట్టు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రకటించారు. సెలవును అమలు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక రేపు జరగాల్సిన ‘మీకోసం’ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినట్టు కలెక్టర్ స్పష్టం చేశారు.


మరోవైపు ఏలూరు జిల్లాలో కూడా రేపు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏలూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా రేపు అన్ని పాఠశాలలు, అన్ని కాలేజీలకు సెలవు ఇస్తున్నట్టు కలెక్టర్ వెట్రి సెల్వి ప్రకటించారు.


అనకాపల్లి జిల్లాలో హై అలర్ట్...

భారీ వర్షాల నేపథ్యంలో అనకాపల్లి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లను జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు రెవెన్యూ డివిజినల్ అధికారి, అనకాపల్లి, నర్సీపట్నం కార్యాలయాలలో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ల ద్వారా ఎవరైనా సహాయం పొందవచ్చునని జిల్లా కలెక్టర్ సూచించారు.


జిల్లా కలెక్టర్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూం ఫోన్ నెంబర్లు 08924-226599, 08924-222888 గా ప్రకటించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి, అనకాపల్లి కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 9491998293 అని, రెవెన్యూ డివిజనల్ అధికారి, నర్సీపట్నం కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 7075356563 అని అధికారులు ప్రకటించారు.

Updated Date - Sep 08 , 2024 | 09:09 PM

Advertising
Advertising