ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP: వైసీపీకి మరో బిగ్ షాక్.. టీడీపీలో చేరిన 8 మంది సర్పంచులు..

ABN, Publish Date - Nov 17 , 2024 | 12:31 PM

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఖాళీ అయింది. తాజాగా, 8 మంది వైసీపీ సర్పంచులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరారు.

పశ్చిమ గోదావరి జిల్లా: వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి చేరుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఖాళీ అయింది. తాజాగా, ఆ పార్టీ అధినేత జగన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని 8 గ్రామాల సర్పంచులు వైసిపీకి గుడ్ బై చెప్పి మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.

జగన్ పాలనలో సర్పంచులకు కనీస గౌరవం కూడా దక్కలేదు. గ్రామాభివృద్ధే ధ్యేయంగా భావించి పని చేసిన సర్పంచుల పరిస్థితి దీనంగా మారింది. గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం అప్పులు చేసి మరి పనులు చేశారు. వారు చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు రాక, చేసిన అప్పులు తీర్చలేక సర్పంచులు కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ప్రభుత్వం స్పందించి సర్పంచులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని వైసీపీ పాలనలో రోడ్డుపై ఆందోళనలు చేసినా ఫలితం మాత్రం కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే వైసీపీ సర్పంచులకు జగన్ పార్టీపై అసహనం ఏర్పడిందని అందుకే ఆ పార్టీని వీడి టీడీపీలోకి చేరారని తెలుస్తుంది.

Updated Date - Nov 17 , 2024 | 12:47 PM