Highway work be Completed : హైవే పనులు పూర్తి అయ్యేదెన్నడో
ABN, Publish Date - Sep 19 , 2024 | 11:17 PM
చాగలమర్రి నుంచి మదనపల్లెకు 2022లో నేషనల్ హైవే నాలుగు లేన్ల రోడ్డు మంజూరైంది. ఏడాది పాటు వేంపల్లె నుంచి రాయచోటి వరకు ఒక పక్క పనులు శర వేగంగా పనులు ప్రారంభించారు. అదే ఊపులో పనులు జరిగిఉంటే ఈపాటికి పనులు పూర్తయి రాకపోకలకు ఇబ్బందులుండేవి కావు.
లక్కిరెడ్డిపలె సెప్టంబరు19: చాగలమర్రి నుంచి మదనపల్లెకు 2022లో నేషనల్ హైవే నాలుగు లేన్ల రోడ్డు మంజూరైంది. ఏడాది పాటు వేంపల్లె నుంచి రాయచోటి వరకు ఒక పక్క పనులు శర వేగంగా పనులు ప్రారంభించారు. అదే ఊపులో పనులు జరిగిఉంటే ఈపాటికి పనులు పూర్తయి రాకపోకలకు ఇబ్బందులుండేవి కావు. 2023 నుంచి మూకుమ్ముడిగా పనులు సాగాయి. అక్క డక్కడా కల్వర్టుల ఏర్పాటుకు రోడ్డును అడ్డంగా తవ్విపెట్టారు. రాయచోటి-వేంపల్లె రహదారిలో దాదాపు 15పైగా కల్వర్టులున్నాయి. ఏ ఒక్క కల్వ ర్టు కూడా పూర్తి కాలేదు అన్ని కల్వర్టుల్లో గుంత లుతీసి కడ్డీలు అమర్చి వదిలేశారు. కల్వర్టులున్న చోట వర్షం కురిస్తే మోకాలు లోతు నీరు చేరి ద్విచక్రవాహనాలు ఎక్కువగా ప్రమాదాలు జరు గుతున్నాయి. రాయచోటి వేంపల్లె గంటన్నర ప్రయాణమైతే ఈ రోడ్డు మార్గాన వెళ్లాలంటే 3 గంటలు సమయం పడుతోందని ప్రజలు వాపో తున్నారు. బస్సులో ప్రయాణం చేసేవారి పరిస్థితి ఇలా ఉంటే ద్విచక్రవాహనంలో వెళ్లేవారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఈ మూడేళ్లలో ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారు సుమారు 10 మంది పైగా మృత్యువాత పడ్డారు. అందులో 20 నుంచి 30 ఏళ్లున్న యువకులే ఎక్కువ.
చాగలమర్రి-రాయ చోటి రహదారి సుమారు రూ.100 కోట్లతో పనులు మొదలు పెట్టారు. రహదారి కోసం భూ ములు కొనుగోలు చేశారు. లక్కిరెడ్డిపల్లె, చింత కుంటపల్లె, కోనంపేట, బండపల్లె, గొల్లపల్లె, రా యచోటి గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా స్థలాలు, ఇళ్లు స్థలాలకు డబ్బు చెల్లించారు. తరువాత రోడ్డుపనుల్లో అలసత్వం జరుగుతోంది. లక్కి రెడ్డిపల్లె- రాయచోటి మధ్య ఆరుగురు మృత్యు వాత పడ్డారు. ఇక వేంపల్లె, పాయలోపల్లె, చక్రా యపేట, ప్రాంతాల్లో కూడా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. నిత్యం ఆటోలు, ద్విచక్రవాహనాలు, కార్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఏళ్ల తరబ డి నేషనల్ హైవేపనులు ఇలా నిలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. రాత్రి వేళ ఈ రోడ్డు మార్గాన వెళ్లాలంటే కచ్చితంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాలని వాహనదారులు వాపోతున్నా రు. గత ప్రభుత్వంలో రోడ్డు పనులు ఆగిపోయా యని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ రోడ్డు పనులు ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. పనులు ప్రారంభించకపోతే మరెన్నో ప్రమాదా లు జరిగే అవకాశాలున్నాయని ప్రజలు వాపోతు న్నారు. ఇప్పటికైనా అధికారులు రహదారి పను లు వేగవంతం చేయాలని కోరుతున్నారు.
Updated Date - Sep 19 , 2024 | 11:17 PM