ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ 172 కోట్లు ఎక్కడ?

ABN, Publish Date - Aug 21 , 2024 | 05:42 AM

గత ఐదేళ్లలో జగన్‌ సర్కారు అడ్డగోలుగా అప్పులు చేసింది. కేంద్రం నిధులను ఇష్టారీతిన దారి మళ్లింది. 2023-24లో కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ.172 కోట్లు ఏమి చేసిందో? ఎందుకు ఖర్చు పెట్టిందో నేటికీ అంతు చిక్కడం లేదు. రాష్ట్రాలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్రం రాష్ట్రాల మూలధన

జగన్‌ హయాంలో కేంద్రం నిధుల మళ్లింపు

విశాఖలో యూనిటీ మాల్‌ కోసం ప్రతిపాదనలు

2023-24లో విడుదల చేసినా మాల్‌ కట్టని వైనం

ఆ డబ్బు ఎటు మళ్లించారు? రుషికొండ ప్యాలె్‌సకా?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత ఐదేళ్లలో జగన్‌ సర్కారు అడ్డగోలుగా అప్పులు చేసింది. కేంద్రం నిధులను ఇష్టారీతిన దారి మళ్లింది. 2023-24లో కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ.172 కోట్లు ఏమి చేసిందో? ఎందుకు ఖర్చు పెట్టిందో నేటికీ అంతు చిక్కడం లేదు. రాష్ట్రాలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్రం రాష్ట్రాల మూలధన వ్యయం కోసం ప్రత్యేక సాయం అనే పథకాన్ని కరోనా తర్వాత నుంచి అమలు చేస్తోంది. మూలధన వ్యయం విభాగంలోకి వచ్చే ప్రాజెక్టుల ప్రతిపాదనలను ఆయా రాష్ట్రాలు పంపితే, సంబంధిత శాఖలు వాటిని పరిశీలించి, ఆమోదించాక వాటికయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుంది. ఈ పథకాన్ని వాడుకోవడంలో వైసీపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. నాలుగేళ్లలో కేవలం 2022-23లో మాత్రమే సమర్థవంతంగా వాడుకుంది. 2020-21లో రూ.688 కోట్లు, 2021-22లో రూ.501 కోట్లు, 2022-23లో రూ.6,105 కోట్లు, 2023-24లో రూ.172 కోట్లు ఈ పథకం కింద జగన్‌ సర్కార్‌ వాడుకోగలిగింది. 2023-24లో వైజాగ్‌లో యూనిటీ మాల్‌ కడతామంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రూ.172 కోట్లతో ప్రతిపాదనలు పంపింది.


ప్రత్యేక సాయం పథకం కింద నిధులు కేటాయించాలని కోరింది. అయితే 2022-23లో ఈ పథకం కింద వాడుకున్న నిధులకు యూసీలు సమర్పించిన తర్వాత 2023-24 ప్రతిపాదనలకు నిధులు విడుదల చేస్తామని కేంద్రం ఆర్థిక శాఖకు లేఖ రాసింది. కానీ 2023-24లో ఈ పథకం కింద రాష్ట్రానికి రూ.180 కోట్లు విడుదలైనట్టుగా కేంద్రం వెల్లడించిన వివరాల్లో ఉంది. అందులో రాష్ట్రం రూ.172 కోట్లు వాడేసినట్టు పేర్కొంది. వైజాగ్‌లో యూనిటీ మాల్‌ కట్టనేలేదు. ఆ రూ.172 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం తెచ్చారు. అయితే ఎక్కడ వాడారు? జగన్‌ ఐదేళ్ల పాలనలో కట్టిన ఏకైన భవనం రుషికొండ ప్యాలెస్‌ మాత్రమే. రుషికొండ ప్యాలెస్‌ ఖర్చు రూ.500 కోట్లు. ఆ రూ.172 కోట్లను రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణం కోసం మళ్లించారా? అనేది స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం ఢిల్లీ నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందని హెచ్చరిస్తూ 2023 సెప్టెంబరులో కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌, వెల్‌నెస్‌ కేంద్రాలు, పీఎం ఆవాస్‌ యోజన (గ్రామీణ్‌, అర్బన్‌), అంగన్‌వాడీ, పోషన్‌ 2.0 పథకాల మార్గదర్శకాలు ఉల్లంఘించినట్టు వెల్లడించింది. అలాగే, 13 కేంద్ర ప్రభుత్వ పథకాల ఇంటరెస్ట్‌ డిపాజిట్‌ సర్టిఫికెట్లను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించలేదని 2024 జనవరి 9న రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. 84 పథకాలకు సంబంధించిన సర్టిఫికెట్లను రాష్ట్రం సమర్పించిందని ఇందులో 3 పథకాలకు సంబంధించి కొంత వివాదం ఉందని వెల్లడించింది. 7 స్కీములు ఆపేశాక డీడీవో మ్యాపింగ్‌ చేశారని పేర్కొంది. మరో 3 స్కీముల్లో సమర్పించిన సర్టిఫికెట్లు పీఎ్‌ఫఎంఎ్‌సలో ఉన్న వివరాలతో సరిపోలడం లేదని వెల్లడించింది. చాలా సర్టిఫికెట్ల మీద ఆర్థిక శాఖ సెక్రటరీల సంతకాలు, స్టాంపులు లేవని పేర్కొంది. ఆర్టీఐ కార్యకర్త రవికుమార్‌ అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఈ సమాచారం ఇచ్చింది.

Updated Date - Aug 21 , 2024 | 07:29 AM

Advertising
Advertising
<