AP Politics: ఫేక్ ఓటర్ల విషయంలో చర్యలెందుకు ఆలస్యం.. ఆ నేతల్ని కాపాడేందుకేనా?
ABN, Publish Date - Jan 21 , 2024 | 11:31 AM
ఏపీలో ఫేక్ ఓటర్ల విషయంలో ఇటివల ఓ జిల్లా కలెక్టర్ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అయితే 2021 తిరుపతి ఎన్నికల్లో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవడానికి రెండేళ్లకు పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో ఎందుకు ఇంత ఆలస్యమైందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఏపీలో ఫేక్ ఓటర్ల విషయంలో ఇటివల ఓ జిల్లా కలెక్టర్ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అయితే 2021 తిరుపతి ఎన్నికల్లో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవడానికి రెండేళ్లకు పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో ఎందుకు ఇంత ఆలస్యమైందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అధికార వైసీపీ నేతలను కాపాడేందుకే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
మరోవైపు రెండు మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఫేక్ ఓట్ల వ్యవహరంలో ఇంకా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దొంగ ఓట్లకు సంబంధించిన అందించిన ఫిర్యాదులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటారా? లేదా వైసీపీ నేతలకు సపోర్ట్ చేసేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు ఇటీవల గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఫాం-7 దరఖాస్తులను పెద్ద ఎత్తున సమర్పించారు. అయితే వాటిలో ఓ వర్గానికి చెందిన టీడీపీ నేత సానుభూతిపరుల ఓట్లు తీసేయాలంటూ 9895 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 2052 అప్లికేషన్లను తిరస్కరించగా.. 7,663 దరఖాస్తులను ఆమోదించారు. అవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినవేనని విచారణలో తేలినప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ నేతలు నైరాశ్యం వ్యక్తం చేస్తున్నారు. అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మాత్రం వైసీపీ నేతలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఇలాంటివే నంద్యాల జిల్లా బనగానపల్లె, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గాల్లో కూడా జరిగాయి. ఫారం 7 అప్లికేషన్లను భారీగా సమర్పించగా పలువురిపై కేసులు నమోదు చేశారు. దీంతోపాటు 24 మంది బీఎల్వోలపై కూడా చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కానీ గుంటూరులో మాత్రం నామమాత్రంగా ఆయా నేతలపై కేసులు పెట్టి వదిలేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. అంతేకాదు ఆయా నేతలపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తే టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారని అన్నారు టీడీపీ నేతలు. మరి అధికారులు స్పందించి ఓట్ల అక్రమార్కులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.
Updated Date - Jan 21 , 2024 | 11:31 AM