Will you kill me sir.. : చంపేస్తారా సారూ..
ABN, Publish Date - Nov 12 , 2024 | 11:19 PM
అభం శుభం తెలియని విద్యార్థిని టీచర్ వ ల్లంతా వాచేలా కొట్టాడని, తప్పు చేస్తే మంద లించాలే తప్ప ఎవరూ కొట్టరని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చితకబాదడంతో విద్యా ర్థి తీవ్ర అస్వస్థతకు లోనవడంతో విద్యార్థి తల్లి దండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు.
విద్యార్థిని చితకబాదిన టీచర్
లేచి నడవలేకపోతున్న విద్యార్థి
వళ్లంతా గుల్లచేశాడు : తల్లి
సుండుపల్లె, నవంబరు 12(ఆంధ్రజ్యోతి):
అభం శుభం తెలియని విద్యార్థిని టీచర్ వ ల్లంతా వాచేలా కొట్టాడని, తప్పు చేస్తే మంద లించాలే తప్ప ఎవరూ కొట్టరని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చితకబాదడంతో విద్యా ర్థి తీవ్ర అస్వస్థతకు లోనవడంతో విద్యార్థి తల్లి దండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. జడ్పీ హైస్కూల్‌లో మంగళవారం సాయంత్రం కొందరు విద్యార్థులు కొట్టుకున్నారు. అక్కడ ఏడో తరగతి విద్యార్థి బొమ్మల విఘ్నేశ్ కూడా ఉండడంతో ఆ విద్యార్థి కూడా గొడవలో పాల్గొ న్నాడన్న ఉద్దేశంతో ఉపాధ్యాయుడు కొట్టాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు తప్పు చేస్తే భయపెట్టాలి లేదా తల్లిదం డ్రుల కు చెప్పాలి కానీ, వళ్లంతా వాచేలా కొట్టి లేవ లేని స్థితికి తీసుకువచ్చారంటూ తల్లిదండ్రులు, గుల్లవాండ్లపల్లె గ్రామస్తులు పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన చేశారు. మీ పిల్లలను ఇలాగే కొడితే చూస్తూ ఉంటారా అని ఇతర ఉ పాధ్యా యులను వారు ప్రశ్నించారు. గతంలో విఘ్నే శ్‌కు చేయి విరగడంతో సర్జరీ చేసిన చేతిపై వాతలు వచ్చేలా కొట్టారని ఆవేదన వ్యక్తం చే శారు. విద్యార్థి ఎక్కువగా అల్లరి చేస్తున్నాడని గతంలో అతని తండ్రికి చెప్పానని, ఈ రోజు కూడా అల్లరి చేయడంతోనే కొట్టానని, పొరపా టైందని టీచర్ లోకేశ్ చెప్పారు. ఇకపై అలా జరగకుండా చూసుకుం టానని క్షమాపణ చెప్పాడు. శాంతించిన తల్లిదండ్రులు విద్యార్థిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ విష యంపై విచారించి టీచర్‌పై చర్యలు తీసుకుం టామని మండల విద్యాఅధికారులు తెలిపారు.
Updated Date - Nov 12 , 2024 | 11:19 PM