YS.Jagan: విజయమ్మను చంపే ప్రయత్నం.. నేనే చేశానంటూ...
ABN, Publish Date - Nov 07 , 2024 | 05:46 PM
రెండేళ్ల క్రితం తన తల్లి విజయమ్మను తానే చంపే ప్రయత్నం చేశానంటూ తప్పుడు వార్తలు రాశారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అత్యంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Jagan: వైసీపీ అధినేత జగన్ రెండేళ్ల క్రితం తన తల్లి విజయమ్మ కారుకు జరిగిన ప్రమాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయమ్మ కారుకు ప్రమాదం జరిగితే తాను చంపే ప్రయత్నం చేశానని తనపై తప్పుడు వార్తలు రాశారని అన్నారు. ఇది అసత్యమని విజయమ్మ లెటర్ ఇస్తే అది ఫేక్ అన్నారని.. విజయమ్మ వచ్చి వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారని వివరించారు. అత్యంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప ఎస్పీకి నా భార్య భారతి ఫోన్ చేసినట్టు ఫేక్ న్యూస్ వేశారని అని అన్నారు.
డీజీపీకి వార్నింగ్..
ఈ క్రమంలోనే రిటైర్ అయ్యాక కూడా పోలీసుల సంగతి చూస్తామని వారికి వార్నింగ్ ఇచ్చారు. సప్త సముద్రాల అవతల ఉన్నా పోలీసులను ఇక్కడకు పిలిపిస్తామని.. చేసిన తప్పులను బయటకు తీసి చట్టం ముందు దోషులుగా నిలబెడతామని అన్నారు. డీజీపీ చట్టం వైపు, న్యాయం వైపు నిలబడాలని సూచించారు. డీజీపీ అధికార పార్టీ కార్యకర్తల మాదిరి మాట్లాడుతున్నారని అన్నారు. డీజీపీకి తమ ప్రభుత్వ హయంలో మంచి పదవి ఇచ్చామని.. పదవి వ్యామోహంతో డీజీపీ ఇలా తయారయ్యాడని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా వెటకారం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఇదే ఉండదనే విషయం తెలుసుకోవాలని హెచ్చరించారు. ఇదే రీతిలో వ్యవహరిస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో పోలీసులు సరిగా పనిచేస్తే అత్యాచారాలు, హత్యలు ఎందుకు జరుగుతాయి? అని ప్రశ్నించారు.
అక్రమ కేసులు..
చంద్రగిరిలో టెన్త్ క్లాస్ పాపపై అత్యాచారం జరిగిందని.. బాధిత పాప తండ్రి మాట్లాడినా పోలీసులు చర్యలు తీసుకోలేదని విమర్శలు గుప్పించారు. బలవంతంగా బాధిత తండ్రితో స్టేట్ మెంట్ ఇప్పించారని అన్నారు. సమాజ స్పృహ ఉన్న వారు సోషల్ మీడియా వారు ప్రశ్నిస్తే రాష్ట్రంలో అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఈక్రమంలో జమిలి ఎన్నికపై జగన్ మరోసారి స్పందించారు. జమిలి గిమిలి అంటున్నారు.. అధికారం కూడా త్వరగా కోల్పోవచ్చు అని కామెంట్స్ చేశారు. జమిలి ఎన్నికలు లేకపోయినా నాలుగేళ్ల సమయం మాత్రమే ఉంటుందని.. తర్వాత వైసీపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రెడ్ బుక్ పెట్టడం వాళ్లకు మాత్రమే తెలుసా? రెడ్ బుక్ పెట్టడం పెద్ద విషయం కాదని..బాధితులు అందరూ రెడ్ బుక్ పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు.
Also Read:
త్వరలో నీకు సినిమా పక్కా.. జోగికి మైలవరం ఎమ్మెల్యే వార్నింగ్
అసెంబ్లీ కార్యదర్శికి ఆ అర్హత లేదు..
రాజీ కుదిరిందని కొట్టేయలేం: లైంగిక వేధింపుల కేసులో సుప్రీం కీలక తీర్పు
For More Telugu and National News
Updated Date - Nov 07 , 2024 | 06:19 PM