ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YCP : కర్నూలులోనూ ఆ కంపెనీకే..!

ABN, Publish Date - Oct 11 , 2024 | 04:50 AM

ఆ కంపెనీని జగన్‌ జమానాలో వైసీపీ నేతలు అడ్డగోలుగా ప్రోత్సహించారు. సొసైటీ చట్టం కింద అర్హత లేకున్నా ఐదేళ్లూ కర్నూలులో ఆ కంపెనీకే డీ-సిల్టింగ్‌ కాంట్రాక్టు పనులు కట్టబెట్టారు.

  • హైకోర్టు వద్దన్నా డీ-సిల్టింగ్‌ పనులు

  • వైసీపీ హయాంలో కర్నూలులో అడ్డగోలుగా కాంట్రాక్టులు

  • కూటమి ప్రభుత్వంలోనూ అదే కంపెనీకి...

  • కోర్టు తీర్పు వెలువడిన తర్వాతా మారని తీరు

  • తుంగభద్రలో ఐదు పాయింట్ల కేటాయింపు

  • బోట్స్‌మెన్‌ సొసైటీ అభ్యంతరాలూ బుట్టదాఖలు

(అమరావతి- ఆంధ్రజ్యోతి)

ఆ కంపెనీని జగన్‌ జమానాలో వైసీపీ నేతలు అడ్డగోలుగా ప్రోత్సహించారు. సొసైటీ చట్టం కింద అర్హత లేకున్నా ఐదేళ్లూ కర్నూలులో ఆ కంపెనీకే డీ-సిల్టింగ్‌ కాంట్రాక్టు పనులు కట్టబెట్టారు. ఇదే కంపెనీ ఇటీవల నెల్లూరులో టెండరులో పాల్గొనేందుకు ప్రయత్నించగా, హైకోర్టు అడ్డుకుంది. ఆ కంపెనీకి అర్హత లేదని తేల్చేసింది. అయితే, పాత తేదీ వేసి టెండరు కట్టబెట్టేశారు. కోర్టు తీర్పు వెలువడిన తర్వాతే కర్నూలులో తాజాగా పిలిచిన టెండరులోనూ ఇదే కంపెనీకి తుంగభద్రలో ఐదు డీ-సిల్టింగ్‌ పాయింట్లు కట్టబెట్టారు.

అటు గత వైసీపీ ప్రభుత్వంలోనూ, ఇటు కూటమి ప్రభుత్వంలోనూ ఒకే కంపెనీకి పిలిచి మరీ కాంట్రాక్టులు కట్టబెట్టిన వైనం చర్చనీయాంశంగా మారింది. ఆ వివ రాల్లోకి వెళ్తే, ఉచిత ఇసుక పంపిణీలో కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం నదుల్లో ఉన్న పూడికను తీసే పేరిట (డీ-సిల్టింగ్‌) ఇసుక త వ్వకాలకు టెండర్లు పిలుస్తోంది. ఇటీవల కర్నూలులోనూ టెండర్‌ పిలవగా ఓ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. కానీ ఆ కంపెనీకి టెండర్‌లో పాల్గొనే అర్హత లేదు. ఎందుకంటే, అది బోట్స్‌మెన్‌ సొసైటీ పరిధిలో లేదు. జీవో 43 ప్రకారం సహకార సొసైటీల చట్టం-1964 కింద ఏర్పాటైన బోట్స్‌మెన్‌ సొసైటీలకే ఆ కాంట్రాక్టు ఇవ్వాలి.


కానీ టెండర్‌ దక్కించుకున్న సంస్థకు, దాని జాయింట్‌ వెంచర్‌ కంపెనీకి ఆ అర్హత లేదు. అది సంక్షేమ సంఘం సొసైటీ మాత్రమే. అది సొసైటీస్‌ చట్టం-2001 కింద ఏర్పాటైంది. సహకార సొసైటీ చట్టం-1964 కింద ఏర్పాటుకాని కంపెనీకి టెండర్‌ ఇవ్వకూడదని ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం నెల్లూరులో ఆ కంపెనీకి టెండర్‌ ఇవ్వడానికి వీల్లేదు.

కానీ, పాత తేదీలతో అక్కడ టెండర్‌ కట్టబెట్టారు. మరి కర్నూలులో కూడా ఇదే కంపెనీకి ఎలా టెండర్‌ ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చిన జీవో 43ను కలెక్టర్‌, జేసీలు చదవలేదా? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆ టెండర్‌ను రద్దుచేయాలని బోట్స్‌మెన్‌ సొసైటీ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తిచేసినా అది బుట్టదాఖలయింది.

Updated Date - Oct 11 , 2024 | 04:50 AM