YCP Leader: పుంగనూరులో పెద్దిరెడ్డికి షాక్!
ABN, Publish Date - Jun 28 , 2024 | 05:23 AM
చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్ద షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ ఎస్.అలీంబాషా, మరో 10 మంది కౌన్సిలర్లు గురువారం వైసీపీకి రాజీనామా చేశారు.
వైసీపీకి మున్సిపల్ చైర్మన్ రాజీనామా
ఇంకో పది మంది కౌన్సిలర్లు కూడా..
మరికొందరితో కలిసి త్వరలో టీడీపీలోకి
పుంగనూరు, జూన్ 27: చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్ద షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ ఎస్.అలీంబాషా, మరో 10 మంది కౌన్సిలర్లు గురువారం వైసీపీకి రాజీనామా చేశారు. తమ రాజీనామాలను పార్టీ అధినేత జగన్‌కు పంపారు. వీరిలో రహంతుల్లా అలియాస్ అమ్ము, ఎం.రామకృష్ణమరాజు, మమత, యువకుమారి, కాళీదాస్ మొదలియార్, ఖాన్ నూర్జహాన్, మనోహర్, జేఎంసీ నరసింహులు, కసురున్నీషా, రేష్మ ఉన్నారు. ఈ మున్సిపాలిటీలో చైర్మన్ సహా మొత్తం 31 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరంతా వైసీపీ వాళ్లే.
నాటి ఎన్నికల్లో పెద్దిరెడ్డి పోలీసుల సహకారం, వైసీపీ రౌడీయిజంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. 31 మందినీ బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్నారు. వీరిలో చైర్మన్ సహా 11 మంది ఇప్పుడు రాజీనామా చేశారు. వీరు టీడీపీలో చేరేందుకు సంసిద్ధత తెలుపగా.. స్థానిక నేతలు వీరిని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఇంటికి ఈ సందర్భంగా చైర్మన్ అలీంబాషా, కౌన్సిలర్ అమ్ము మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబం తమకు పదవులు ఇచ్చినా అభివృద్ధి చేయడానికి అధికారం ఇవ్వకుండా రబ్బరు స్టాంపులుగా వాడుకున్నారని ఆరోపించారు. చల్లా ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధికి..ప్రజలకు సేవ చేయడానికి త్వరలో తాము మరికొంతమంది కౌన్సిలర్లతో కలిసి టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. చల్లా మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి ముస్లింలను రెచ్చగొట్టి బీజేపీకి ఓట్లు వేయొద్దని ప్రచారం చేశారని ఆరోపించారు. పెద్దిరెడ్డి వైఖరి నచ్చక చాలా మంది టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
Updated Date - Jun 28 , 2024 | 05:23 AM