ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mangalagiri: ముగిసిన విచారణ.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన జోగి రమేశ్

ABN, Publish Date - Aug 21 , 2024 | 07:06 PM

వైసీపీ నేత జోగి రమేష్‌ బుధవారం మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన పోలీస్ విచారణ అనంతరం సర్కిల్ కార్యాలయం నుంచి జోగి రమేశ్ సైలెంట్‌గా బయటకు వెళ్లిపోయారు. మీడియాతో సైతం ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ రోజు జరిగిన పోలీస్ విచారణకు తన తరఫు న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, విజయవాడ నగరానికి చెందిన వైసీీపీ నేత పి. గౌతంరెడ్డితో కలిసి జోగి రమేశ్ మంగళగిరి సర్కిల్ కార్యాలయానికి వచ్చారు.

గుంటూరు, ఆగస్ట్ 21: గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంపై దాడికి యత్నించిన కేసులో వరుసగా నోటీసులు అందుకుంటున్న నేపథ్యంలో వైసీపీ నేత జోగి రమేష్‌ బుధవారం మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన పోలీస్ విచారణ అనంతరం సర్కిల్ కార్యాలయం నుంచి జోగి రమేశ్ సైలెంట్‌గా బయటకు వెళ్లిపోయారు.

మీడియాతో సైతం ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ రోజు జరిగిన పోలీస్ విచారణకు తన తరఫు న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, విజయవాడ నగరానికి చెందిన వైసీీపీ నేత పి. గౌతంరెడ్డితో కలిసి జోగి రమేశ్ మంగళగిరి సర్కిల్ కార్యాలయానికి వచ్చారు. తన న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుట జోగి రమేశ్... తన వాదనలు వినిపిస్తున్నారు.

Also Read: West Bengal horror: కోల్‌కతాలో కొనసాగుతోన్న హర్రర్ సీన్స్..


తొలిసారి.. మూడోసారి నోటీసులకు జోగి రమేశ్ స్పందన..

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడి నివాసంపై పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ దాడికి యత్నించారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని జోగి రమేశ్‌కు వరుసగా మూడు సార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మూడోసారి.. అంటే నిన్న మంగళవారం నోటీసులు జారీ చేశారు. బుధవారం సాయంత్రం 4.00 గంటలకు మంగళగిరి సర్కిల్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని జోగి రమేశ్‌కు జారీ చేసిన నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు.

Also Read: KTR: తప్పుంటే.. దగ్గరుండి ఫామ్ హౌస్ కూలగొట్టిస్తా


మంగళవారం విచారణకు డుమ్మా.. ఎందుకంటే..

ఇప్పటికి రెండు సార్లు నోటీసులు జారీ చేయగా.. గత శుక్రవారం జోగి రమేశ్ తొలిసారి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో మంగళవారం సైతం విచారణకు హాజరుకావాలని జోగి రమేశ్‌కు పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం రెండోసారి నోటీసులు జారీ చేశారు. కానీ మంగళవారం విచారణకు జోగి హాజరు కాలేదు. దీంతో ఆయన తరఫు న్యాయవాదులు.. మంగళగిరి సర్కిల్ కార్యాలయానికి వెళ్లి.. వివరణ ఇచ్చారు.

Also Read: Shahjahan: పాపం.. షాజహాన్ కథ వింటే కన్నీళ్లాగవు


అదీకాక జోగి రమేశ్‌ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైందంటూ ఓ ప్రచారం అయితే మంగళవారం జోరందుకుంది. దీంతో ఈ విచారణకు ఆయన డుమ్మా కొట్టారంటూ ఓ ప్రచారం అయితే వాడి వేడిగా సాగింది. తొలిసారి పోలీస్ విచారణకు హాజరైనప్పుడు.. దాదాపు గంటన్నర పాటు జోగి రమేశ్‌ను పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.

Also Read: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘హైడ్రా’ (వెబ్ స్టోరీ)


2019 ఎన్నికల ఫలితాల అనంతరం..

2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ కొద్ది మాసాలకే ఉండవల్లిలోని కరకట్టపైనున్న నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు నివాసంపై దాడికి పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ యత్నించిన సంగతి తెలిసిందే. అనంతరం అంటే.. జగన్ మలి కేబినెట్‌లో జోగి రమేశ్‌కు స్థానం కల్పించారు. ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పెడన నుంచి పోటీ చేసి కూటిమి అభ్యర్థి టీడీపీ నాయకుడు కాగిత కృష్ణప్రసాద్ చేతిలో జోగి రమేశ్ ఓటమి పాలయ్యారు.

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 21 , 2024 | 07:08 PM

Advertising
Advertising
<