AP Assembly Elections: వాలంటీర్లపై దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - May 01 , 2024 | 07:43 PM
ఆంధ్రప్రదేశ్‌లోని వాలంటీర్లుపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి కండువా వెయ్యని, రాజీనామా చెయ్యని వాలంటీర్ మే 5 వ తారీఖు అనంతరం ఉండరని ఆయన స్పష్టం చేశారు.
శ్రీకాకుళం, మే 1: ఆంధ్రప్రదేశ్‌లోని వాలంటీర్లుపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి కండువా వెయ్యని, రాజీనామా చెయ్యని వాలంటీర్ మే 5 వ తారీఖు అనంతరం ఉండరని ఆయన స్పష్టం చేశారు.
Salman Khan: నివాసం వద్ద కాల్పులు: నిందితుడు ఆత్మహత్య
వైసీపీ కండువా వేసుకుని రాజీనామా చేసి తాను చెప్పిన విధంగా నడుచుకుంటారో.. ఆ వాలంటీర్ మాత్రమే కొనసాగుతాడని ఆయన కుండ బద్దలు కొట్టారు. ఇప్పటీ వరకు రాజీనామా చెయ్యకుండా.. పార్టీ కండువా వేసుకోకుండా ఉండే వాలంటీర్ ఉంటే.. వారు మనకు పని చెయ్యరని చెప్పారు.
Lok Sabha Elections: నామినేషన్ వేసిన మేనక గాంధీ.. ఆ రెండు స్థానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Lok Sabha Elections: వారణాసిలో మోదీ నామినేషన్.. ముహుర్తం ఖరారు
ఆ క్రమంలో వారిపై దృష్టి సారించామని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. అలాంటి వాలంటీర్లు.. ఎవరైనా రాజీనామా చెయ్యకుండా ఉంటే.. ఈ రోజే రాజీనామా చెయ్యాలని లేదా మే 3వ తేదీ లోపు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఆయన హుకుం జారీ చేశారు.
Droupadi Murmu: అయోధ్య రామమందిరంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు..
అలా రాజీనామా చెయ్యని వాలంటీర్ మనకు అక్కర లేదని.. అలాంటి వాడి అవసరం కూడా లేదన్నారు. అయితే అతడి స్థానంలో మరొకరు వస్తారని తెలిపారు. ఈ పదిరోజులు ఎన్నికల్లో ఎవడు పని చేస్తే వాడే మనకు తర్వత కాలంలో వాలంటీర్‌గా కొనసాగుతాడని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Read Latest National News And Telugu News
Updated Date - May 01 , 2024 | 08:29 PM