ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: గుడివాడలోని వైసీపీ కార్యాలయం ఖాళీ..

ABN, Publish Date - Jul 16 , 2024 | 01:30 PM

కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ కార్యాలయం ఖాళీ అయ్యిందని.. గుడివాడలోని శరత్ థియేటర్‌లో టీ పార్టీకి హాజరైన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు.

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ కార్యాలయం ఖాళీ అయ్యిందని.. గుడివాడలోని శరత్ థియేటర్‌లో టీ పార్టీకి హాజరైన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ఐదేళ్లుగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని శరత్ థియేటర్‌ను ఆక్రమించుకుని.. మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే శరత్ టాకీస్‌ను యాజమాన్యం స్వాధీనం చేసుకుందని అన్నారు. శరత్ టాకీస్ యాజమాన్యంలో ఒకరైన మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు టీ పార్టీకి ఎమ్మెల్యే రాము, టీడీపీ నేతలు హాజరయ్యారు. థియేటర్లో వైసీపీ ఫ్లెక్సీలు.. కొడాలి నాని ఫోటోలను థియేటర్ యజమాన్యం తొలగించింది.

జగన్ ఇలాంటివి చాలా చేశారు..


ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. తమకు జరిగిన అన్యాయంపై థియేటర్ హక్కుదారులు తనను కలిశారన్నారు. గుడివాడ నడిబొడ్డులో ఇన్నాళ్లు అరాచకానికి అడ్డాగా వైసీపీ కార్యాలయం నిలిచిందన్నారు. ఇక్కడకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేదని.. ఆఖరుకు ముగ్గురు హక్కుదారులు థియేటర్‌కు వస్తే బెదిరింపులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొందన్నారు. గుడివాడ వ్యాప్తంగా కొడాలి నాని అనుచరులు.. పేద, మధ్యతరగతి వర్గాల ఆస్తులను కబ్జా చేశారని.. వారందరికీ కూడా న్యాయం చేస్తామని వెనిగండ్ల రాము తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే కొడాలి నాని కబ్జాలో ఉన్న తొమ్మిది ఎకరాల స్థలాన్ని హక్కు దారులకు అప్పగించామని పేర్కొన్నారు. టీడీపీ ప్రజల తరపున పనిచేస్తుందని.. ప్రజల డబ్బు కోసం ఆశపడే వాళ్లెవరూ తమ పార్టీలో లేరన్నారు. గుడివాడలో ప్రజలకు జరిగిన అన్యాయలపై పోరాడుతానన్నారు. గుడివాడలో అరాచకాలు రూపుమాపి ప్రజల ఊరుగా మారుస్తానని వెనిగండ్ల రాము అన్నారు.

పోలీసుల అదుపులో కిడ్నీ రాకెట్ కేసు నిందితులు..


థియేటర్ వాటాదారుడు యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కొన్నేళ్ల తర్వాత తన ఆస్తిని చూసుకునేందుకు వచ్చానని తెలిపారు. 75% వాటా ఉన్న తాము.. తమ కష్టాన్ని ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయమని కోరామన్నారు. మా భాగస్వామ్యులం హక్కుగా మా ఆస్తిని పరిరక్షించుకుంటామన్నారు. తమ విజ్ఞప్తి మేరకు టీ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపారు..

ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ వాసులకు సీఎం చంద్రబాబు శుభవార్త

పిన్ని టార్చర్.. నిజామాబాద్‌లో దారుణం..

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 01:30 PM

Advertising
Advertising
<