YS Jagan: అప్పులపై బాబు తప్పుదోవ పట్టిస్తున్నారు.. శ్వేతపత్రాలపై జగన్ స్పందన
ABN, Publish Date - Jul 26 , 2024 | 01:12 PM
అప్పులపై సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) విమర్శించారు. శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
తాడేపల్లి: రాష్ట్ర అప్పులపై సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan) ఆరోపించారు.
శుక్రవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు (Chandrababu) పాలనలో రాష్ట్రం తిరోమనంలో వెళ్తోందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 52 రోజుల్లో రాష్ట్రంలో అక్రమాలు, ఆకృత్యాలు పెరిగిపోయాయని ఆరోపణలు గుప్పించారు.
"52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోంది. ప్రశ్నించే వాళ్లను అణచివేస్తున్నారు. వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విధ్వంస పాలన సాగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. బడ్జెట్ కూడా పెట్టలేని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. పూర్తి స్థాయి బడ్జెట్ పెడితే బాబు హామీలకు లెక్కలు చూపాల్సి వస్తుంది. అందుకే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వెనకడుగేస్తున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. బాబు పాలనలోనే రాష్ట్రం ఆర్థికంగా దిగజారింది’’ అని జగన్ అన్నారు.
ఎన్నికల సమయంలో 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెబుతూ.. సూపర్ సిక్స్ హామీలు జగన్ విమర్శించారు. ‘‘ఇప్పుడు అధికారం వచ్చాక అది చూపించడానికి ఇబ్బందులు పడుతున్నారు. గవర్నర్ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్ల అప్పు అయ్యిందని చూపించారు. శ్వేత పత్రాలతో మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. ఆర్బీఐ, కాగ్, రాష్ట్ర బడ్జెట్ లెక్కల ప్రకారం 2024 జూన్ వరకు కూటమి సర్కార్ గద్దెనెక్కేవరకు రూ.5 లక్షల 18 వేల కోట్ల అప్పు మాత్రమే అయింది. చంద్రబాబు హయాంలో 21.63 శాతం దాకా అప్పు చేశారు. వైసీపీ హయాంలో 12.9 శాతం అప్పు చేశాం. కేంద్ర ఆర్థిక సర్వే మా ప్రభుత్వ పని తీరును మెచ్చుకుంది. బడ్జెట్‌లోనూ ఈ లెక్కలన్నీ చెప్పాల్సి వస్తుందనే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదు. 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పడం సరికాదు" అని జగన్ అన్నారు.
చంద్రబాబు ఏమన్నారంటే..
2019-24మధ్య రాష్ట్రంలో భారీగా జరిగిన ఆర్థిక నిర్వహణ లోపాలపై శ్వేతపత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు సభ ముందు ఉంచారు. అయిదేళ్ల పాటు పట్టిసీమను ఆపరేట్ చేయలేదని వెల్లడించారు. గోదావరి ఉన్నంత వరకూ ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదన్నారు. అయితే ఆ పరిస్థితి కూడా తెచ్చిన వ్యక్తి నాటి పాలకుడు అని పేర్కొన్నారు.
పోలవరం 15364 కోట్లు ఖర్చు చేశామని.. అదే టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే ఈ పాటికే ప్రాజెక్టు ఆపరేషన్ లో ఉండేదన్నారు. కేంద్రం వేసిన ఎక్సఫర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ప్యారలల్‌గా కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని అత్యవసర క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో రూ. 990 కోట్లు దీనికోసం ఖర్చే చేయాల్సి వస్తోందని చంద్రబాబు తెలిపారు.
న్యూ ఎపిక్ సెంటర్ గ్రోత్ అమరావతి... ఈ ప్రాజెక్టును చూస్తే కొత్తనగరాలు ఆవశ్యకత ఎంతో ఉందని చంద్రబాబు తెలిపారు. అమరావతి ఇదే స్పీడ్‌లో ఆర్టీఫిషియల్ ఇంటిలలిజెన్స్ సిటీ గా తయారై ఉండేదని.. కానీ దాన్ని దుర్మార్గులు దెబ్బతీసేలా వ్యవహరించారన్నారు. ఒక్క వివాదం లేకుండా రైతులు ల్యాండ్ ఇచ్చారని పేర్కొన్నారు.
గతంలో హైదరాబాద్ అంటే పాకిస్ధాన్ హైదరాబాదా?.. ఇండియా హైదరాబాదా? అని అడిగేవారని చంద్రబాబు అన్నారు. ఇప్పడు హైదరాబాద్ అంటే ఇండియాలోని హైదరాబాద్ మాత్రమే అని అందరూ గుర్తించారన్నారు. 7 లక్షల మంది ఉద్యోగులు అమరావతిలో ఉండేవారని... 3 నుంచి నాలుగు లక్షల కోట్ల ఆస్తి అమరావతితో వచ్చేదని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
MP Raghunandan Rao: నిధులు వచ్చుడో, ఇద్దరం చచ్చుడో అన్నారు కదా.. రండి..
Japan: జపాన్‌లో భారీగా తగ్గుతున్న జనాభా.. ఎందుకో తెలుసా
Read latest AP News And Telugu News
Updated Date - Jul 26 , 2024 | 01:30 PM