అరెస్టు సమ్మతం కాదు: జగన్
ABN, Publish Date - Dec 14 , 2024 | 05:56 AM
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టును వైసీపీ అధ్యక్షు డు, మాజీ సీఎం జగన్ శుక్రవారం ఎక్స్ వేదికగా ఖండించారు.
అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టును వైసీపీ అధ్యక్షు డు, మాజీ సీఎం జగన్ శుక్రవారం ఎక్స్ వేదికగా ఖండించారు. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణా లు కోల్పోయిన ఘటనలో అల్లు అర్జున్‌పై నేరుగా కేసులు బనాయించి మరీ అరెస్టు చేయడం ఏమాత్రం సమ్మతం కాదని ట్వీట్ చేశారు. తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమేనని.. ఆ సమయంలో అర్జున్ బాధ్యతగా వ్యవహరించారని పేర్కొన్నారు.
Updated Date - Dec 14 , 2024 | 05:56 AM