Tadepalli Palace : ‘కంచె’ కలిసిరాలేదా..?
ABN, Publish Date - Dec 10 , 2024 | 06:22 AM
ఓ పక్క సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి.. మరోపక్క తరుముకొస్తున్న కేసులు.. ఈ కలసి రాని కాలానికి వాస్తు దోషాలే కారణమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నట్లు ఉన్నారు.
జగన్ తాడేపల్లి ప్యాలె్‌సలో వాస్తు మార్పులు
ఇటీవలే దక్షిణ దిశలో కంచె తొలగింపు
తాజాగా ఈశాన్యంలో మార్పులు
అమరావతి, గుంటూరు, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఓ పక్క సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి.. మరోపక్క తరుముకొస్తున్న కేసులు.. ఈ కలసి రాని కాలానికి వాస్తు దోషాలే కారణమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నట్లు ఉన్నారు. దీంతో ఆయన తాడేపల్లి ప్యాలె్‌సలో చకచకా వాస్తు దోషాలు సవరిస్తున్నారు. ఆ ఇంటి చుట్టూ ఉన్న ఇనుప కంచెను వాస్తుకు అనుగుణంగా మార్పు చేస్తున్నారు. గాలి కోసం అంటూ ఇటీవల దక్షిణ దిశలో కంచెను తీసివేశారు. సోమవారం తూర్పు-ఈశాన్యం వైపు కంచెలో కొన్ని వరుసలను తొలగించారు. తూర్పు ఈశాన్యం మూత వేసి ఉంచడం మంచిది కాదని వాస్తు పండితులు చెప్పిన నేపథ్యంలో ఈ దిద్దుబాట్లు చేస్తున్నారని సమాచారం. అయితే జగన్ ఇంటికి ఇలా వాస్తు మార్పులు చేయడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రజలెందుకు తిరస్కరించారో విశ్లేషించుకోకుండా ఆయన సాకులు వెతుక్కుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటమి నెపాన్ని ఇంటి వాస్తుపైకి నెట్టేస్తున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఇదే ఇంటిలో ఉండగా 2019లో ఆయన అధికారంలోకి వచ్చారని వారు గుర్తుచేస్తున్నారు.
Updated Date - Dec 10 , 2024 | 07:27 AM