ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: ప్రత్యేకహోదా కోసం వైఎస్ షర్మిల ఢిల్లీలో ధర్నా

ABN, Publish Date - Feb 02 , 2024 | 10:18 AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఢిల్లీలో ఈ రోజు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ధర్నా చేపడుతారు.

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) గళం ఎత్తారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ గడ్డ మీద ఈ రోజు ధర్నా చేపడుతున్నారు. అంతకుముందు విపక్ష నేతలను వరసగా కలుస్తున్నారు. వివిధ పార్టీ నేతల మద్దతు కోరారు. ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల దూకుడు పెంచారు.

షర్మిల షెడ్యూల్ ఇదే..

పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా గురించి అడగాలని విపక్ష నేతలను షర్మిల కోరతారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. ఉదయం 10.30 గంటలకు డీఎంకే ఎంపీ తిరుచి శివను షర్మిల కలుస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశం అవుతారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మద్దతు ఇవ్వాలని ఆయా నేతలను కోరతారు.

షర్మిల ధర్నా

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని షర్మిల పట్టుబడుతన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏపీ భవన్ వద్ద ధర్నా చేపడుతారు. షర్మిలతోపాటు ఏపీ కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ధర్నాలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం అవుతారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఖర్గేకు షర్మిల వివరిస్తారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 02 , 2024 | 10:39 AM

Advertising
Advertising