YS Sharmila: ‘సిద్ధం’ ప్రచారానికి 600 కోట్లు
ABN, Publish Date - Mar 11 , 2024 | 08:01 AM
ఒక్కో ‘సిద్ధం’ సభ కోసం రూ.90 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఖర్చు చేశారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. సిద్ధం పేరిట ప్రచారం కోసం రూ.600 కోట్లు వ్యయం చేశారని, ఈ డబ్బంతా జగన్‌కు ఎక్కడిదని నిలదీశారు. ఈ డబ్బుపై కేంద్ర సంస్థలు ఎందుకు దర్యాప్తు చేయట్లేదని ప్రశ్నించారు.
ఒక్కో సభకు 90 కోట్లు ఈ డబ్బంతా ఎక్కడిది?
ఈ అవినీతిపై కేంద్రం దర్యాప్తు చేయదెందుకు?
రాజకీయ ప్రత్యర్థులపైనే ఈడీ దాడులు
జగన్ విషయంలో ఈడీ ఎక్కడికి పోయింది?
బీజేపీకి జగన్ వారసుడు.. ఆ పార్టీతో రహస్య పొత్తు
హోదా కోసం అసలు డిమాండ్ చేశారా.. షర్మిల ధ్వజం
అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ఒక్కో ‘సిద్ధం’ సభ కోసం రూ.90 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) ఖర్చు చేశారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. సిద్ధం పేరిట ప్రచారం కోసం రూ.600 కోట్లు వ్యయం చేశారని, ఈ డబ్బంతా జగన్‌కు ఎక్కడిదని నిలదీశారు. ఈ డబ్బుపై కేంద్ర సంస్థలు ఎందుకు దర్యాప్తు చేయట్లేదని ప్రశ్నించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ (Congress Party) రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) బాహాటంగా పొతు పెట్టుకుంటే .. జగన్ రహస్య పొత్తు పెట్టుకున్నాడని షర్మిల విమర్శించారు. ప్రధాని మోదీ మోసానికి కేరాఫ్ అయితే.. బీజేపీ (BJP)కి జగన్ వారసుడన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ (CBI), ఈడీ (ED)లను కేంద్రం ప్రయోగిస్తోందని ఆక్షేపించారు. ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియాను జగన్ ప్రోత్సహిస్తున్నారంటూ కేంద్ర మంత్రులు ఆరోపిస్తున్నా.. ఎందుకు ఈడీ దాడులు నిర్వహించట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
YS Jagan: నిష్క్రమణకు సిద్ధమా?
హోదాపై కేంద్రాన్ని నిలదీశారా..?
ప్రధాని మోదీ (PM Modi) ప్రవేశపెట్టిన చట్టాలన్నింటికీ జగన్ బేషరతుగా మద్దతిచ్చారని, ప్రత్యేక హోదా (Special Status) కోసం జగన్ ఏనాడైనా డిమాండ్ చేశారా? అని షర్మిల నిలదీశారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న జగన్ ఎన్ని ఉద్యోగాలిచ్చాడో చెప్పాలని నిలదీశారు. ఎన్నికలకు రెండు నెలలుందనగా... కేవలం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు దగా చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల్లేక యువత ఐదు వేలు, ఎనిమిది వేల రూపాయల జీతాలకు పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మాటలను నిలదీస్తే తనతో సహా కాంగ్రెస్ నేతలందరినీ టెర్రరిస్టుల మాదిరిగా అరెస్టు చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుల కోసం కాంగ్రెస్ పార్టీ ‘భర్తీ భరోసా’ పేరిట మేనిఫెస్టోను తీసుకువచ్చిందని.. దీని మేరకు 30 లక్షల ఉద్యోగాలు దక్కుతాయని షర్మిల చెప్పారు. ఎన్నికల్లో తానెక్కడ పోటీ చేయాలన్న దానిపై త్వరలోనే స్పష్టత ఇస్తామని షర్మిల చెప్పారు.
Siddham: జగన్.. గ్రాఫిక్స్ ‘షో’
Updated Date - Mar 11 , 2024 | 08:01 AM