ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Sharmila: బాబాసాహెబ్‌పై అమిత్‌షా వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనం

ABN, Publish Date - Dec 20 , 2024 | 06:05 AM

భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

ఆయన భారత జాతికి క్షమాపణలు చెప్పాలి

తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి: షర్మిల

అమరావతి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. గురువారం ఆమె ఎక్స్‌ సామాజిక మాధ్యమంలో స్పందించారు. ‘అంబేడ్కర్‌ రాసిన భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మను సంస్కృతిని అమలు చేసేందుకు సంఘ్‌ పరివార్‌ కుట్ర పన్నింది. అందులో భాగంగానే అంబేడ్కర్‌పై అమిత్‌షా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మను సంస్కృతిని బీజేపీ విశ్వసిస్తున్నందునే అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తోంది. రాజ్యాంగ నిర్మాతను ప్రతిసారి బీజేపీ హేళన చేస్తోంది. అమిత్‌షా వ్యాఖ్యలతో భారత రాజ్యాంగం మీద, జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదని నిరూపితమైంది. అంబేడ్కర్‌ను అవమానించినందుకు అమిత్‌షా భారత జాతికి క్షమాపణలు చెప్పాలి. మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలి’ అని షర్మిల డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 20 , 2024 | 06:05 AM