YS Viveka Case: ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ సునీత
ABN, Publish Date - May 10 , 2024 | 12:39 PM
వైఎస్ వివేకా హత్య కేసులో సొంత అక్కచెల్లెమ్మలకు న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలోని మహిళలకు ఏం చేస్తాడనే విపక్షాల ప్రశ్నకు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇస్తూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ సునీత మండిపడ్డారు. సొంత చెల్లెళ్లకు న్యాయం చేయకపోవడం అనేది తన వ్యక్తిగత విషయమంటూ జగన్ అనడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Case) సొంత అక్కచెల్లెమ్మలకు న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలోని మహిళలకు ఏం చేస్తాడనే విపక్షాల ప్రశ్నకు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇస్తూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ సునీత మండిపడ్డారు. సొంత చెల్లెళ్లకు న్యాయం చేయకపోవడం అనేది తన వ్యక్తిగత విషయమంటూ జగన్ అనడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎంగా ఉన్న ఉన్నవారికి వ్యక్తిగత అజెండా ఏమీ ఉండకూదని, వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీఎం న్యాయం, ధర్మం వైపు ఉండాలని సునీత అన్నారు. చెల్లెళ్ల వైపు ఉండాల్సిన అవసరం లేదని, న్యాయంవైపు ఉంటే చాలు అని అన్నారు. న్యాయం జరగాల్సింది వైఎస్ వివేకా మర్డర్ కేసులో అని అన్నారు. వైఎస్ వివేకా కేసు జగన్‌కు వ్యక్తిగత విషయం కాదని, లా అండ్ ఆర్డర్‌కు సంబంధించిన విషయమన్నారు. ఒక మనిషి చనిపోయాక ఐదేళ్లు గడిచినా న్యాయం జరగలేదని, న్యాయానికి అడ్డుపడడం నేరమని జగన్‌పై ఆమె ధ్వజమెత్తారు. వివేకా హత్య జరిగి 5 సంవత్సరాలు గడిచినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా సామాన్య వ్యక్తి కాదని, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి అని ప్రస్తావించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వివేకా తమ్ముడని, వైఎస్ జగన్‌కు చిన్నాన్న.. అంతటి మనిషికి న్యాయం జరగకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రజల సంగతి ఏంటి అని సునీత ప్రశ్నించారు.
లా అండ్ ఆర్డర్ విషయాన్ని తన వ్యక్తిగత విషయమని చెబుతున్నారని సీఎం జగన్‌పై సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకూడదని పోరాడుతున్నానని ఆమె చెప్పారు. రాష్ట్రంలో ప్రజల మంచి కోసం పోరాడుతున్నానని, వ్యక్తిగత విషయమైతే రౌడీలను పెట్టుకొని హంతకులను నరికేయవచ్చునని, కానీ తన ఉద్దేశం రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని ఆమె పేర్కొన్నారు. కడప ప్రజలు న్యాయం వైపు ఉన్నారా లేదా అని ప్రపంచమంతా చూస్తోందని వైఎస్ సునీత అన్నారు.
ఇక వైఎస్ వివేకా హత్య కేసు విషయాన్ని రాజకీయం చేశామంటూ వైఎస్ జగన్ తమపై నిందలు వేస్తున్నారని సునీత మండిపడ్డారు. ఈ విషయం గురించి రాజకీయంగా తాను ఎక్కడా మాట్లాడలేదని ఆమె ప్రస్తావించారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
వైఎస్ వివేకా గుండెపోటు చనిపోయాడంటూ ‘సాక్షి మీడియా’లో ఎందుకు వార్తలు వేశారో ఇంకా వివరణ ఇవ్వడంలేదని ఆమె మండిపడ్డారు. సాక్షి ఓవర్ వైఎస్ భారతి అని, గుండెపోటు అని వార్తలు ఎందుకు వేశారో చెప్పడంలేదు అని ప్రశ్నించారు. మీడియా ఇంటర్వ్యూల్లో జగన్‌ను ఈ ప్రశ్న ఎందుకు అడగడంలేదని ఆమె అన్నారు. హత్య రోజు ఉదయం 10.30 గంటల వరకు హార్ట్ ఎటాక్ అని ఎందుకు చెప్పారని ఆమె నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డితో తనతో మాట్లాడి చెయించాడని ఏదో ఇంటర్వ్యూలో దస్తగిరే చెప్పాడని సునీత ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి
AP Elections: చివరి రెండు రోజులు.. ఎవరి వ్యూహాలు వారివి..!
Mudragada Padmanabham: ప్రతీ ఇంటిలో ప్యాన్లు ఉంటాయి.. గతంలో గాజు గ్లాసు పగిలి పోయింది
Read Latest AP News and Telugu News
Updated Date - May 10 , 2024 | 12:51 PM