ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YS Sunitha Reddy: వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వైఎస్ సునీతా రెడ్డి

ABN, Publish Date - Apr 16 , 2024 | 06:58 PM

వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డిపై దివంగత నేత వైఎస్ వివేకానంద కూతురు వైఎస్ సునీత మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. తన రాజకీయ ఆకాంక్షలు, రాజకీయ లక్ష్యాలు లేవని ఆమె స్పష్టం చేశారు. తనకు ఈర్ష్య, ధ్వేషం ఉందనడం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ అసలు నాకు అవినాశే పరిచయం లేనప్పుడు ధ్వేషం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. ఇక అధికారం అనేది నాకు కొత్త కాదు. ఈ ఫ్యామిలీలో పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను’’ అని అన్నారు.

కడప: వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డిపై దివంగత నేత వైఎస్ వివేకానంద కూతురు వైఎస్ సునీత మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. తన రాజకీయ ఆకాంక్షలు, రాజకీయ లక్ష్యాలు లేవని ఆమె స్పష్టం చేశారు. తనకు ఈర్ష్య, ధ్వేషం ఉందనడం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ అసలు నాకు అవినాశే పరిచయం లేనప్పుడు ధ్వేషం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. ఇక అధికారం అనేది నాకు కొత్త కాదు. ఈ ఫ్యామిలీలో పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఈ అధికారానికి దూరంగా వెళ్దామని ఇంతకాలం ప్రయత్నిస్తున్నాను. ఈ విషయం మెడికల్ ఫీల్డ్‌లో ఉన్న అందరికీ తెలుసు. కానీ దేవుడు ఏం రాసి పెట్టాడో. ఈ పరిస్థితిని కల్పించాడు. ఇక్కడికి రావాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నాను. వివేకా మర్డర్ కేసులో బహుశా రాజకీయ నాయకులు కల్పించుకోకపోతే ఒక కానిస్టేబుల్ తేల్చిపడేసే కేసు ఇది. అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ రాజకీయ నాయకుల ప్రభావంతో ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పోరాడుతూనే ఉన్నాను. ఇంకా సాగుతూనే ఉంది. ఎంతకాలం సాగుతుందో తెలియదు’’ అని అన్నారు.


ఈ కేసులో దస్తగిరి అప్రూవర్ స్టేటస్‌ని అవినాశ్ రెడ్డి ప్రశ్నించారని, అప్రూవర్ స్టేటస్ అనేది చట్టంలో ఒక ప్రాసెస్ అని అన్నారు. అప్రూవర్ స్టేటస్ విషయం కోర్టుకి, దర్యాప్తు సంస్థకు మధ్య ఉంటుందని ఆమె అన్నారు. అప్రూవర్ అయినంత మాత్రాన దస్తగిరి నిర్దోషి కాదు అని సునీత గుర్తుచేశారు. ‘‘ అప్పుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మాటవిని మాట్లాడానని, ఇప్పుడు చంద్రబాబు మాట విని మాట్లాడుతున్నానని అంటున్నారు. మా నాన్నని హత్య చేశారని నేను అంటుంటే. నేను వాళ్లతో మాట్లాడడం, వీళ్లతో మాట్లాడడం అసలు విషయమా?’’ అని ప్రశ్నించారు.

మా కుటుంబాన్ని ఇబ్బందిపెడుతున్నారని, మా నాన్న జైల్లో పెట్టారని అవినాశ్ రెడ్డి అంటున్నారు. మరి మా కుటుంబం సంగతేంటి?. మా నాన్నను అత్యంత దారుణంగా చంపేశారు.

Updated Date - Apr 16 , 2024 | 07:19 PM

Advertising
Advertising