ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Politics: క్షుద్రపూజలు చేస్తూ దొరికిపోయిన వైసీపీ నేత..

ABN, Publish Date - Nov 17 , 2024 | 02:02 PM

వైసీపీ నాయకుడు వజ్ర భాస్కర్ రెడ్డి కుద్రపూజలు చేస్తూ పోలీసులకు పట్టుబడటం జిల్లాలో కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా వి.కొత్తకోట అటవీ ప్రాంతంలోని ఓ ఆలయంలో క్షుద్ర పూజలు చేస్తుండగా..

కదిరి, నవంబర్ 17: వైసీపీ నాయకుడు వజ్ర భాస్కర్ రెడ్డి కుద్రపూజలు చేస్తూ పోలీసులకు పట్టుబడటం జిల్లాలో కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా వి.కొత్తకోట అటవీ ప్రాంతంలోని ఓ ఆలయంలో క్షుద్ర పూజలు చేస్తుండగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వజ్ర భాస్కర్ రెడ్డి పలు పార్టీలను మారారు. నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచడం ఆయనకు అలవాటని స్థానికులు విమర్శిస్తున్నారు. వజ్ర భాస్కర్ రెడ్డి 2019లో కదిరి వైసీపీ టిక్కెట్ ఆశించారు. దక్కక పోవడంతో మరో పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. 2024 ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలో చేరారు.


బీజేపీలో ఉండగా మహిళా కార్యకర్తలకు స్థలం ఇస్తానని నమ్మించారు. ఇవ్వకుండా మోసగించారు. దీంతో బాధిత మహిళలు ఆయన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రియల్ ఎస్టేస్ వ్యాపారం చేసే వజ్ర భాస్కర్ రెడ్డి, కొత్త బైపాస్ రోడ్డుకు సమీపంలో ప్లాట్లు వేశారు. తనకు చెందిన రెండు సర్వే నంబర్ల మధ్యలో ఉన్న 3 సెంట్ల ప్రభుత్వ భూమిని కలుపుకున్నారు. ప్రభుత్వ భూమిలో రోడ్లు వేసి, తన భూమిలో ప్లాట్లు వేసుకున్నారు. ప్రభుత్వ భూమి విలువ ఒకటిన్నర కోట్లు ఉంటుంది.


అందరూ అంతేనా..!

రియల్ మోసాలు, ప్రభుత్వ భూముల కబ్జా, ప్రజలను మోసం చేయడం.. వంటి అనేక కేసుల్లో కదిరికి చెందిన పలువురు వైసీపీ నాయకులు నిందితులుగా ఉన్నారు. తలుపుల ఉప సర్పంచ్ డి. క్రిష్ణారెడ్డి, ఆలియాస్ డిక్కీ బాబు టీచర్‌ను మోసగించి జైలుపాలయ్యారు. వివిధ ప్రాంతాల్లో రైస్ పుల్లింగ్ పేరిట మోసాలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇదే మండలానికి చెందిన వజ్ర భాస్కర్ రెడ్డి క్షుద్ర పూజలు చేస్తూ పట్టుబడ్డారు.


Also Read:

కిమ్ మామ వింత చేష్టలు.. నిద్రలేని రాత్రులతో ప్రజలు

ప్రియురాలితో జాలీ రైడ్‌.. ఊహించని షాక్..

అయ్యో దేవుడా.. నీకు మనసెలా వచ్చిందయ్యా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Nov 17 , 2024 | 02:02 PM