ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హెల్మెట్‌ ధారణపై స్పెషల్‌ ఫోకస్‌

ABN, Publish Date - Dec 20 , 2024 | 01:14 AM

హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో వాహన చోదకులంతా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించేలా చూడాల్సిందిగా అధికారులు, సిబ్బందికి నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి మరోమారు ఆదేశాలు జారీచేశారు.

  • హెల్మెట్‌ డ్రైవ్‌లో జూలై ఒకటి నుంచి డిసెంబరు 18 వరకు నమోదైన కేసులు

  • మొత్తం కేసులు 4,73,441

  • విధించిన జరిమానా రూ.4,73,44,100

  • సస్పెండ్‌ చేసిన డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రూ.1,18,594

---------------------------------

ఇప్పటికే ఎక్కడికక్కడ తనిఖీలు

ఈ-చలాన్‌జారీతోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెన్షన్‌

త్వరలో సిగ్నల్స్‌ వద్ద ఆటోమెటిక్‌ ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలు

ఉల్లంఘనకు పాల్పడితే ఆటోమెటిక్‌గా ఈ-చలాన్‌ జారీ

ఫిబ్రవరి నాటికి శతశాతం హెల్మెట్‌ ధారణ లక్ష్యంగా నగర పోలీస్‌ కమిషనర్‌ చర్యలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో వాహన చోదకులంతా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించేలా చూడాల్సిందిగా అధికారులు, సిబ్బందికి నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి మరోమారు ఆదేశాలు జారీచేశారు. వచ్చే ఫిబ్రవరి నాటికి నగరంలో శతశాతం హెల్మెట్‌ ధరించేలా చూడాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఏటా సగటున 1,400 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటిలో సగటున 350 మంది మరణిస్తే, మరో 1,300 మంది క్షతగాత్రులవుతున్నారు. సగానికిపైగా రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాల ప్రమేయం ఉంటోంది. మృతుల్లో సగానికిపైగా ద్విచక్ర వాహనదారులు, అందులోనూ 70 శాతం మంది హెల్మెట్‌ ధరించని వారు ఉంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జూలైలో సీపీగా బాధ్యతలు చేపట్టిన శంఖబ్రత బాగ్చీ వాహన చోదకులంతా హెల్మెట్‌ ధరించేలా ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలని ట్రాఫిక్‌తోపాటు శాంతి భద్రతల విభాగం పోలీసులను ఆదేశించారు. పట్టుబడిన వారికి జరిమానా విధించడంతోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను మూడు నెలలు సస్పెండ్‌ చేయిస్తున్నారు. దీనివల్ల వాహన చోదకుల్లో కాస్త మార్పు వచ్చింది. గత ఏడాది జూలై-నవంబరు మధ్య జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల 46 మంది, ధరించినా 41 మంది మృతిచెందగా, ఈ ఏడాది జూలై-నవంబరు మధ్య జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్‌ లేకపోవడం వల్ల 42 మంది, హెల్మెట్‌ ఉన్నప్పటికీ మరణించిన వారి సంఖ్య 30కి తగ్గింది.

హైకోర్టు ఆదేశాలతో తనిఖీలు మరింత ముమ్మరం:

రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్‌ ధరించని కారణంగా మూడు నెలల్లోనే 688 మంది మరణించడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాహన చోదకులు హెల్మెట్‌ ధరించేలా కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో నగరంలో తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని సీపీ శంఖబ్రత బాగ్చి కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది జూలై నుంచి డిసెంబరు 18 వరకూ హెల్మెట్‌ లేకుండా వాహనాలను నడుపుతున్న 4,73,441 మందిపై కేసులు నమోదుచేసి వారి నుంచి రూ.4,73,44,100 వసూలుచేసేలా ఈ-చలాన్‌లు జారీచేశారు. పట్టుబడిన వారిలో 1,18,594 మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌లను సస్పెండ్‌ చేశారు.

చాలావరకూ మార్పు కనిపిస్తుంది

సీపీ శంఖబ్రతబాగ్చి

నగరంలో హెల్మెట్‌ ధారణపై విస్తృతంగా అవగాహన కల్పించడం, ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ జరిమానాలు విధించడం, లైసెన్స్‌లు సస్పెన్షన్‌ చేయడంతో చాలావరకు మార్పు కనిపిస్తోంది. నేను సీపీగా బాధ్యతలు తీసుకున్నప్పుడు నగరంలో 20 శాతం హెల్మెట్‌ ధారణ ఉంటే ఇప్పుడు 50 శాతానికి పెరిగింది. వచ్చే ఫిబ్రవరి నాటికి శతశాతం చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. పోలీసులను చూసి కొంతమంది హెల్మెట్‌ పెట్టుకుంటున్నారు. దాటగానే హెల్మెట్‌ తీసి మళ్లీ పక్కనపెడుతున్నారు. అలాంటి వారికి చెక్‌ పెట్టడానికి తగరపువలస నుంచి కూర్మన్నపాలెం వరకు ఉన్న సిగ్నల్స్‌తోపాటు నగరంలోని అన్ని సిగ్నల్స్‌కు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ కలిగిన ఆటోమెటిక్‌ ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ కెమెరాలు ఏర్పాటుచేయబోతున్నాం. ఈ నెలాఖరుకు డీపీఆర్‌ ఖరారైపోతుంది కాబట్టి జనవరి చివరి నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల ట్రిపుల్‌ రైడింగ్‌ చేసినా, హెల్మెట్‌ ధరించకపోయినా, ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడిపినా, సిగ్నల్‌ జంపింగ్‌ చేసినా ఆటోమెటిక్‌గా ఫొటోతో ఈ-చలాన్‌ జారీ అయిపోతుంది. ఆ సమాచారంతోపాటు వాహనం నడిపేవారి ముఖం ఫొటో కూడా తీయడం వల్ల వారి వివరాలన్నీ పోలీస్‌ శాఖతోపాటు రవాణా శాఖకు చేరతాయి. దాంతో వాహనం నడిపేవారి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆటోమేటిక్‌గా సస్పెండ్‌ అయిపోతుంది. ఒకవేళ డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేనివారు అయితే వాహనం యజమానికి భారీ జరిమానాతో ఈ-చలాన్‌ చేరుతుంది. దీనివల్ల తప్పనిసరిగా అందరూ ట్రాఫిక్‌ నిబంధనలతోపాటు రహదారి భద్రతను పాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Updated Date - Dec 20 , 2024 | 01:14 AM