ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

LPG Price Hike: షాకింగ్ న్యూస్.. పెరిగిన LPG గ్యాస్ ధరలు

ABN, Publish Date - Dec 01 , 2024 | 07:20 AM

దేశంలో LPG గ్యాస్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన మారుతుంటాయి. ఈ క్రమంలోనే మళ్లీ వాణిజ్య సిలిండర్ ధరలు పుంజుకున్నాయి. అయితే వీటి ధరలు ఏ మేరకు పెరిగాయి. ఎంతకు చేరాయి, ఏ నగరాల్లో ఎంత ఉన్నాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

LPG gas price hike

డిసెంబర్ నెల (డిసెంబర్ 2024) ఈరోజు నుంచి ప్రారంభమైంది. నెల మొదటి రోజునే ప్రజలు ద్రవ్యోల్బణం షాక్‌ను చవిచూశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆదివారం తెల్లవారుజామున ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ (LPG Price Hike) ధరలు పెరిగాయి. ఈ క్రమంంలో 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్లలో ఈ పెరుగుదల కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1802 నుంచి రూ.1818.50కి పెరిగింది. ఈ విధంగా 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.16.5 పుంజుకుంది. IOCL వెబ్‌సైట్ ప్రకారం ఈ రేట్లు ఈరోజు డిసెంబర్ 1, 2024 నుంచి అమల్లోకి వచ్చాయి.


దేశీయ LPG సిలిండర్ ధరలు

కానీ 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం మార్పు లేదు. చమురు కంపెనీలు వీటి ధరలను పెంచలేదు. చివరగా జూలైలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. దీంతో ఆగస్టు తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు వీటి ధరల్లో మాత్రం మార్పు చేయలేదు. ఈ నేపథ్యంలో దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఈరోజు పాట్నాలో రూ. 892.50గా ఉంది. అదే సమయంలో ఢిల్లీలో 14 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.803కే విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కోల్‌కతాలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50, హైదరాబాద్‌లో రూ. 855, విజయవాడలో రూ. 818.50గా ఉన్నాయి.


వాణిజ్య సిలిండర్లు ఏ నగరాల్లో ఎంత రేటుకు అందుబాటులో ఉన్నాయి?

ఇక వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు కోల్‌కతాలో రూ. 1927కి చేరింది. ఇది నవంబర్‌లో కేవలం రూ.1911.50గా ఉండేది. ముంబైలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.16.50 పెరిగింది. ఇక్కడ రూ.1754.50కి లభించే సిలిండర్ నేటి నుంచి రూ.1771కి అందుబాటులోకి రానుంది.

తెలుగు రాష్ట్రాల్లో

ఇప్పుడు ఈ సిలిండర్ పాట్నాలో రూ. 2072.5కి అందుబాటులో ఉంటుంది. చెన్నైలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1980.50కు చేరుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ రేటు 61 రూపాయలు పెరిగి రూ.1962కు చేరింది. హైదరాబాద్‌లో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 61 రూపాయలు పెరిగి రూ. 2028కి పెరిగింది.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..

Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..


Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..


Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 01 , 2024 | 07:23 AM