ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముఖం స్కాన్‌తో 25 రకాల ఆరోగ్య పరీక్షలు

ABN, Publish Date - Dec 20 , 2024 | 02:31 AM

హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ఏసియానా.. కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత ఆరోగ్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చింది. డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు వెళ్లకుండానే...

ఏఐ ఆధారిత పరీక్షను ఆవిష్కరించిన ఏసియానా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ఏసియానా.. కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత ఆరోగ్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చింది. డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు వెళ్లకుండానే సాధారణ ఆరోగ్య ప్రొఫైల్‌ను కేవలం ముఖాన్ని స్కాన్‌ చేయటం ద్వారా పొందవచ్చని ఏసియానా సీఈఓ కిశోర్‌ కారుమంచి వెల్లడించారు. కంపెనీ రూపొందించిన సియానా హెల్త్‌ యాప్‌ ద్వారా ముఖాన్ని 30 సెకన్లు స్కాన్‌ చేసి 25 రకాల ఆరోగ్య సేవల నివేదిక అందుకోవచ్చన్నారు. బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఏంఐ), కార్డియోవాస్క్యులర్‌ రిస్క్‌లు, పని ఒత్తిడి, టైప్‌ 2 మధుమేహం రిస్క్‌, రక్తపోటు వంటి వివరాలను స్కాన్‌ చేసిన కొద్ది సెకన్లలోనే సియానా హెల్త్‌ యాప్‌ అందిస్తుందని తెలిపారు. ఈ ఏఐ ఆధారిత జెనీవా ఫేస్‌ స్కాన్‌ టెక్నాలజీని కెనడాకు చెందిన కంపెనీ నుంచి అందుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ టెక్నాలజీని ఇప్పటికే పలు హెల్త్‌కేర్‌ సంస్థలు వినియోగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ యాప్‌ ద్వారా వైద్యులు, డయాగ్నోస్టిక్‌ లేబొరేటరీ్‌సను రోగులు సంప్రదించే విధంగా ప్రత్యేక ఫీచర్లను పొందుపరిచినట్లు కిశోర్‌ తెలిపారు.


ఏఐ ఆధారిత అనలిటిక్స్‌, అడ్వాన్స్‌డ్‌ జన్యు సంబంధిత ఇన్‌సైట్స్‌తో సియానా హెల్త్‌కేర్‌ ప్లాట్‌ఫామ్‌ను అనుసంధానం చేసినట్లు చెప్పారు. జన్యు సంబంధిత పరీక్షల వివరాలను తమ ప్లాట్‌ఫామ్‌పై అప్‌లోడ్‌ చేయటం ద్వారా మున్ముందు రాబోయే వ్యాధుల గురించి తెలుసుకునే వీలుండటమే కాకుండా ఆ రుగ్మతలను కట్టడి చేసే అవకాశం ఉంటుందన్నారు. కాగా జెనటిక్స్‌ ఆధారిత వెల్‌నెస్‌ కార్యక్రమాన్ని రూ.22,000-రూ.30,000 ధరతో కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది.

Updated Date - Dec 20 , 2024 | 06:18 AM