ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

2,664 కంపెనీలు.. రూ.1.96 లక్షల కోట్లు..

ABN, Publish Date - Dec 23 , 2024 | 04:53 AM

కొందరు బడా బాబులు బ్యాంకుల సొమ్ముతో మజా చేస్తున్నారు. ఏదో ఒక వ్యాపారం పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, ఆ నిధులను తమ డొల్ల కంపెనీలకు లేదా తమ సొంత ఖాతాలకు...

బ్యాంకులకు కుచ్చుటోపీ

భారీగా పెరిగిన ఉద్దేశపూర్వక ఎగవేతలు

ముంబై: కొందరు బడా బాబులు బ్యాంకుల సొమ్ముతో మజా చేస్తున్నారు. ఏదో ఒక వ్యాపారం పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, ఆ నిధులను తమ డొల్ల కంపెనీలకు లేదా తమ సొంత ఖాతాలకు దర్జాగా దారి మళ్లిస్తూ ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు టోపీ పెడుతున్నారు. ఈ ఏడాది (2024) మార్చి నెలాఖరుకు ఇలా 2,664 కంపెనీలు బ్యాంకులకు రూ.1,96,441 కోట్లు టోపీ పెట్టాయి. 2020 మార్చి నాటికి నమోదైన రూ.1,52,860 కోట్లతో పోలిస్తే ఇది రూ.43,581 కోట్లు ఎక్కువ. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పత్రిక భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నుంచి ఈ వివరాలు రాబట్టింది. ఇలా బ్యాంకుల నెత్తిన టోపీ పెట్టిన బడా బాబులకు చెందిన టాప్‌ 100 కంపెనీల జాబితానూ ఆర్‌బీఐ వెల్లడించింది. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల సంఖ్య కూడా 2020తో పోలిస్తే 2024 మార్చి నాటికి 2,154 నుంచి 2,664కు చేరినట్టు తెలిపింది.


ఎవరు వీరంతా..?

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం తర్వాత వాటిని తమ ఖాతాల్లో వేసుకోవడంలో జువెలరీ, డైమండ్‌ వ్యాపారులే ముందున్నారు. మళ్లీ ఇందులో గీతాంజలి జెమ్స్‌ అధినేతలు మెహుల్‌ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్‌ మోదీ అందరి కంటే ముందున్నారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)కి రూ.8,516 కోట్ల మేర టోపీ పెట్టి ఈ ఇద్దరు తమ బాగోతం బయట పడే ముందే దేశం నుంచి జారుకున్నారు. ఏబీజీ షిప్‌యార్డు అధినేత రిషి అగర్వాల్‌ (రూ.4,684 కోట్లు), కాన్‌కాస్ట్‌ స్టీల్‌ అధినేత సంజయ్‌ సురేఖ (రూ.4,305 కోట్లు), ఎరా ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌ అధినేత హెచ్‌ఎస్‌ భరణ, (రూ.3,637 కోట్లు), ఆర్‌ఈఐ ఆగ్రో అధినేత సందీప్‌ ఝున్‌ఝున్‌వాలా (రూ.3,350 కోట్లు), విన్సమ్‌ డైమండ్స్‌ అధినేత జతిన్‌ మెహతా (రూ.2,927 కోట్లు), కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధినేత విజయ్‌ మాల్యా (రూ.1,023 కోట్లు) కూడా ఈ జగత్‌ కిలాడీల జాబితాలో ఉన్నారు.


ఏడు హైదరాబాద్‌ కంపెనీలు

హైదరాబాద్‌కు చెందిన ఏడు కంపెనీలు కూడా బ్యాంకులకు పెద్ద మొత్తంలోనే టోపీ పెట్టాయి. ఈ ఏడు కంపెనీలు బ్యాంకులకు రూ.7,847 కోట్ల మేర ఎగనామం పెట్టినట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఇందులో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ (ఇండియా) లిమిటెడ్‌ రూ.2,919 కోట్ల ఎగవేతతో అగ్రస్థానంలో ఉంది. దక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ (రూ.1,960 కోట్లు), ఐవీఆర్‌సీఎల్‌ (రూ.842 కోట్లు), వీఎంసీ సిస్టమ్స్‌ (రూ.669 కోట్లు), సురానా ఇండస్ట్రీస్‌ (రూ.594 కోట్లు), బీఎస్‌ లిమిటెడ్‌ (రూ.477 కోట్లు), కోనసీమ గ్యాస్‌ పవర్‌ లిమిటెడ్‌ (రూ.386 కోట్లు) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది.

ఐదేళ్లలో ఉద్దేశపూర్వక ఎగవేతలు

తేదీ ఎగవేతలు రూ.కోట్లలో

31-03-2020 2,154 1,52,860

31-03-2021 2,415 1,80,879

31-03-2022 2,553 2,15,710

31-03-2023 2,622 1,96,035

31-03-2024 2,664 1,96,441

Updated Date - Dec 23 , 2024 | 04:54 AM